Breaking News

అంత్యక్రియలు నేనే చేస్తా.. నువ్వెవరో తెలియదు

Published on Wed, 09/10/2025 - 13:48

కామారెడ్డి రూరల్‌: తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కుమారుడు 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కుమారుడు వెళ్లిపోయాడని ఆ తల్లి కుంగిపోలేదు. కామారెడ్డిలో దొరికిన ఒక అమ్మాయిని పెంచుకుని పెళ్లి చేసి పంపించింది. మంగళవారం ఆ తల్లి మృతి చెందగా చెందగా ‘తానే కొడుకునని అంత్యక్రియలు నేనే చేస్తాను. మా ఊరికి తీసుకెళ్తాను’ అని వచ్చిన కొడుకును నువ్వెవరో తెలియదు అని వెల్లగొట్టారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..

గ్రామానికి చెందిన సల్మాబేగంను 20 సంవత్సరాల క్రితం కుమారుడు వదిలి వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు తనను వదిలి వెళ్లిపోవడంతో కొద్దిరోజులు బాధపడింది. తన రాత ఇంతే అనుకుని జీవిస్తుండగా కొద్దిరోజులకు కామారెడ్డి పట్టణంలో దొరికిన కరిష్మా బేగం అనే చిన్నారిని పెంచుకుంది. పెద్దయ్యాక సల్మాబేగం.. కరిష్మాకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంది. పెళ్లయినా పెంచిన తల్లి మంచి చెడులన్నీ కరిష్మానే చూసుకుంది. గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మంగళవారం సల్మాబేగం మృతి చెందింది. 

20 ఏళ్లుగా అటువైపు రాని కొడుకు తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని, అంత్యక్రియలు చేస్తానని తల్లి శవాన్ని తీసుకొని వెళ్లేందుకు గ్రామానికి వచ్చాడు. దాంతో కొడుకుతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 20 ఏళ్ల తర్వాత తల్లి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ నిలదీశారు. అయితే ఇన్నేళ్ల పాటు సల్మాబేగం మంచి చెడులు చూసిన కరిష్మాయే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లుగా లేని ప్రేమ తల్లి చనిపోయాక రావడంతో ఆస్తి కోసమే వచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.

 

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)