Breaking News

అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం.. పంచాయితీ తీర్పు, రాత్రంతా చీకట్లోనే

Published on Wed, 08/02/2023 - 10:46

ఇచ్చోడ: అప్పు చెల్లించేవరకు ఇంటికి తాళం వేసి ఉంచాలన్న పంచాయితీ పెద్దల తీర్పు కారణంగా బాధిత కుటుంబం రాత్రంతా చీకట్లోనే ఇంటి ముందు జాగరణ చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన రాజేందర్‌ అనే ఆసామి వద్ద అదే గ్రామానికి చెందిన తాత్ర శీను పాలేరుగా పనిచేసేందుకు మూడునెలల క్రితం ఒప్పందం చేసుకున్నాడు.

నెలకు రూ.7 వేల చొప్పున ఒప్పందం కుదుర్చుకుని రూ.34 వేలు అడ్వాన్స్‌ తీసుకున్నాడు. గత జూలై 30వ తేదీ వరకు (దాదాపు మూడు నెలలపాటు) పనిచేశాడు. అయితే ఎడ్లజత సరిగా లేక, వాటితో వేగలేక తాను పనిచేయలేకపోతున్నానని యజమానికి పలుమార్లు చెప్పాడు. కానీ, రాజేందర్‌ స్పందించకపోవడంతో శీను సోమవారం పనికి వెళ్లలేదు. రాజేందర్‌ ఫిర్యాదు మేరకు సర్పంచ్‌ భర్త కన్నమయ్యతోపాటు గ్రామానికి చెందిన కుమ్మరి సాయన్న, కాళ్ల భూమయ్య పంచాయితీ పెట్టారు.

శీను పనికి రాకుంటే తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వా లని తీర్పు చెప్పారు. కొంత సమయం ఇవ్వాలని బాధితుడు ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. డబ్బులు చెల్లించేవరకు ఇంటికి తాళం వేస్తామని చెప్పా రు. పంచాయితీ పెద్దల తీర్పు మేరకు ఇంటికి తాళం వేయడంతో శీను భార్య గంగమణి, తల్లి పోసాని, కుమారులు మల్లేశ్, నవీన్‌తోపాటు కోడలు లక్ష్మి ఇంటి ఆవరణలోనే సోమవారం రాత్రంతా జాగరణ చేశారు. బాధితుడు శీను మంగళవారం ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)