Breaking News

అదనంగా 1,410 ఇంజనీరింగ్‌ సీట్లు 

Published on Fri, 08/18/2023 - 01:19

సాక్షి, హైదరాబాద్‌: ఈ విద్యాసంవత్సరం నుంచే మరో 1,410 ఇంజనీరింగ్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఆఖరి నిమిషంలో ఈ సీట్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఎంసెట్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కూడా మార్చారు.  

♦ మహబూబాబాద్, ఖమ్మం జిల్లా పాలేరులో కొత్తగా రెండు ఇంజనీరింగ్‌ కాలేజీలకు ప్రభుత్వం అనుమతించింది. ఇవి జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో నడుస్తాయి. వాస్తవానికి ఈ రెండు కాలేజీల్లో ఒక్కోదాంట్లో 300 వరకూ సీట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది మాత్రం సీఎస్‌ఈ, ఈసీఈ, సీఎస్‌ఈ–ఎంఎల్‌ కోర్సులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో బ్రాంచ్‌లో 60 చొప్పున, ఒక్కో కాలేజీలో 180 సీట్లు అందుబాటులోకి వస్తాయి. రెండు కాలేజీల్లో కలిపి 360 సీట్లు ఉంటాయి.  

♦ ఘట్‌కేసర్‌లోని కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి ఎంబీఏ కాలేజీకి కూడా ఇంజనీరింగ్‌ కోర్సులకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ కాలేజీలో ఆరు బ్రాంచ్‌లకు కలిపి 360 సీట్లు అదనంగా వస్తాయి. 

♦ హైదరాబాద్‌లోని టీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీని అప్‌గ్రేడ్‌ చేశారు. దీంతో 300 సీట్లు అదనంగా రాబోతున్నాయి.  

♦ ఇవి కాకుండా మరో మూడుకాలేజీలకు అదనంగా సీట్లు ఇవ్వడానికి అనుమతి లభించింది. దీనికి జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ గుర్తింపు రావాల్సి ఉంది.  

♦ ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ కలిపి 1,410 సీట్లు అదనంగా రాబోతున్నాయని ఉన్నత విద్యామండలి పేర్కొంది. 

పెరిగిన సీట్లూ కంప్యూటర్‌ కోర్సుల్లోనే 
కొత్తగా పెరిగే 1,410 సీట్లల్లో ఎక్కువగా కంప్యూటర్‌ కోర్సులే ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 83,766 సీట్లు కన్వీనర్‌ కోటా కింద ఉంటే, 58 వేల వరకూ కంప్యూటర్‌ సంబంధిత బ్రాంచ్‌ల్లోనే ఉన్నాయి. మూడు విడతలుగా సీట్ల భర్తీ చేపట్టినా, ఇంకా 3,034 సీట్లు కంప్యూటర్‌ కోర్సుల్లో మిగిలాయి. తాజాగా మరో 900 వరకూ కొత్త సీట్లు కలుపుకుంటే, దాదాపు 4 వేల సీట్లు మిగిలే అవకాశం ఉంది.  

ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా.. 
ఆఖరిదశలో అనుమతులు, కొత్త సీట్లు రావడంతో వాటి భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్‌ తేదీలు మార్చారు. వాస్తవానికి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ మొదలు పెట్టి, 23న సీట్ల కేటాయింపు చేపట్టాలని భావించారు. ఈ తేదీల్లో మార్పులు చేస్తూ సాంకేతిక విద్యా శాఖ కొత్త షెడ్యూల్‌ ఇచ్చింది.  

18వ తేదీ    స్లాట్‌ బుకింగ్, రిజిస్ట్రేషన్‌ (కొత్తవారు) 
17–22 తేదీల్లో    ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు 
26న    సీట్ల కేటాయింపు 
26–28 తేదీల్లో    ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 
27–29 తేదీల్లో    కాలేజీలో రిపోరి్టంగ్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)