శివాజీకి మహిళా కమిషన్‌ సూటి ప్రశ్నలు

Published on Sat, 12/27/2025 - 09:08

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మహిళా కమిషన్‌లో నటుడు శివాజీ విచారణ కొనసాగుతోంది. దండోరా సినిమా ప్రమోషన్‌లో భాగంగా వేదికపై శివాజీ అనుచిత వాఖ్యలు(misogynistic remark) చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మహిళల వస్త్రధారణపై ఆయన అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకునేందుకు కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ళ శారద విచారణ జరిపారు.

శివాజీకి మహిళా కమిషన్ సంధించిన ప్రశ్నలు.. 

1.మహిళల పై మీరు చేసిన వాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం ప్రభావితం చూపుతుందని కమిషన్ భావిస్తోంది.. మీరేమంటారు?

2. ఒక నటుడిగా మీ వాఖ్యలు సమాజం పై ప్రభావం చూపుతాయి.. ఇది మీకు తెలిసే ఇలాంటి వాఖ్యలు చేశారని కమిషన్ భావిస్తోంది..

3. మహిళల వస్త్రాధారణ ఆధారంగా వాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం.. చదువుకున్న వ్యక్తిగా ఇది మీకు తెలియదా?

4. మీ వాఖ్యలు మహిళలను కించపరిచినట్లు కానట్లయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి!

5. మీ వాఖ్యలు మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులొచ్చాయి.. వీటికి మీ సమాధానం?.. 

పై పశ్నలకు శివాజీ ఇచ్చిన వివరణలను తెలంగాణ మహిళా కమిషన్‌ రికార్డు చేసింది. 

దండోరా సినిమా ఈవెంట్‌లో శివాజీ చేసిన ఆ అసంబద్ధ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. చిన్మయి, అనసూయ, నిధి అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ లాంటి సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా స్వీకరించి.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది. 

అంతకు ముంద.. తాను చేసిన వ్యాఖ్యలకు శివాజీ షరతులతో కూడిన క్షమాపణలు చెప్పారు. తన కెరీర్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదన్న ఈ సీనియర్‌ నటుడు.. తన వ్యాఖ్యలను గానూ మహిళా లోకానికి మనస్ఫూర్తిగా క్షమాపణలంటూ మాట్లాడారు. అయితే తన వ్యాఖ్యల్లో దొర్లిన రెండు అసభ్య పదాలకు మాత్రమే సారీ చెబుతూనే.. తన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడి ఉన్నానంటూ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో శివాజీ మీద తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఫిర్యాదులు, కేసులు నమోదు కాకపోవడం మరో కొసమెరుపు.

 

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)