Breaking News

సరదా.. సరదాకే..

Published on Tue, 06/25/2024 - 08:47

ఎంచుకున్న రంగంలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువేంకాదు.. ఇది ఒకప్పటి మాట.. టెక్నాలజీ రాకతో, సామాజిక మాధ్యమాల ప్రభావంతో నేటి తరం యువత కలలు నెరవేర్చుకుంటున్నారు. సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అలా తాను అనుకున్న ప్రపంచంలోకి అడుగుపెట్టిన వ్యక్తే హర్షిత్‌ రెడ్డి మల్గి...సరదాగా డబ్‌స్మాలతో మొదలై ప్రభాస్‌ కల్కి సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. చిన్నతనం నుంచి తనకు నటనపై ఉన్న సరదా.. అందులోనే నిలదొక్కుకునేందుకు చేసిన తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు.. తెలుసుకుందాం.. 

నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. బిటెక్‌ ఇక్కడే పూర్తి చేశాను. చిన్నతనం నుండే స్కూల్‌లో కల్చరల్‌ ఈవెంట్స్‌లో ఉత్సాహంగా సింగింగ్, యాక్టింగ్‌లలో సరదాగా పాల్గొనేవాడిని. 2018లో డబ్‌స్మాష్‌లను నేను సరదాగా చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌         చే«శాను. దీంతో ఫాలోవర్స్‌ పెరుగుతూ వచ్చారు. అలా ప్రముఖ యూట్యూబ్‌ ఛానల్‌ చాయ్‌బిస్కట్‌లో యాక్టర్‌గా కొన్ని స్కెచ్‌ విడియోస్‌ చేశాను. అలా మొదలైన నా ప్రస్థానం.. నేడు ప్రపంచస్థాయి చిత్రంగా నిలుస్తున్న ప్రభాస్‌ కలి్క–2898 చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నా అని తెలిపారు హర్షిత్‌రెడ్డి మల్గి.  

లాక్‌డౌన్‌లో యాక్టింగ్‌పై మరింత ఆసక్తి... 
లాక్‌డౌన్‌లో వందలాది సినిమాలు చూశాను. అలా నటనపై మరింత ఆసక్తితో పాటు పలు మెళకువలు నేర్చుకున్నాను. అనంతరం ఆడిషన్స్‌ ఇవ్వడం ప్రారంభించాను. అలా ఆహాలో నటుడు ప్రియదర్శితో కలిసి ‘మెయిల్‌’ సినిమాలో మెయిన్‌ రోల్‌ చేశాను. థియేటర్‌లో కాకుండా ఆహాలో విడుదలయింది. తరగతిగదిదాటి, అర్థమైందా అరుణ్‌కుమార్, లూసర్‌ వెబ్‌సీరిస్‌లను చేశాను. అలా నటుడిగా మంచి మార్కులు సాధించి పలు అవార్డులను అందుకున్నాను. మెయిల్‌ చిత్రంలో నటనకు చాలా మంది మెచ్చుకున్నారు.  

కల్కిలో అవకాశం... 
సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ మంచి క్యారెక్టర్స్‌ రాలేదు. ఓ డిఫరెంట్‌ రోల్‌లో చేయాలనుకునే సమయంలో మెయిల్‌ చిత్రం ప్రొడ్యూసర్‌ స్వప్నదత్‌ ప్రభాస్‌తో కల్కి 2898 చిత్రాన్ని చేస్తున్నారు. ఓ మంచి రోల్‌ ఉంది చేస్తావా అని చిత్ర టీం అడగటంతో ఖచి్చతంగా చేస్తానని చెప్పాను. దర్శకుడు నాగ్‌అశి్వన్‌ మెయిల్‌ చిత్రం చూసి ఎటువంటి ఆడిషన్స్‌ లేకుండా సెలెక్ట్‌ చేశారు. హీరో ప్రభాస్‌తో కలిసి ఓ డిఫరెంట్‌ రోల్‌లో నటించడం చాలా సంతోషంగా ఉంది. థియేటర్‌లో రిలీజ్‌ అయ్యే నా మొదటి సినిమా పాన్‌ వరల్డ్‌ సినిమా అవ్వడం మరింత గర్వంగా ఉంది. చిత్రంలో నా క్యారెక్టర్‌ పేరుకూడా కొత్తగా ఉంటూ చిత్రంలోని బుజ్జి క్యారెక్టర్‌తో ఆద్యతం ప్రేక్షకులను అలరిస్తుంది.  

హీరోగా రాణిస్తా... 
ప్రేక్షకులను అలరిస్తూ   డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ హీరో, నటుడిగా రాణించాలని ఉంది. తెలుగులో పుష్ఫ చూశాక అల్లు అర్జున్‌ బాగా నచ్చారు. అలాంటి క్యారెక్టర్‌ చేయాలని ఉంది. నా డ్రీమ్‌రోల్‌ సూపర్‌హీరో రోల్‌ చేయాలని ఉంది. ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం ఇష్టం. హైదరాబాద్‌తో నాకు విడదీయలేని బంధం. ఇక్కడే నా లైఫ్‌ ప్రారంభమై సెలబ్రిటీ హోదాను తీసుకొచి్చంది. ఇండియన్‌ వంటకాలు ఇష్టం. హెల్తీ ఫుడ్‌ తీసుకొని తరచూ జిమ్‌ చేస్తుంటా. ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండటానికే ఇష్టపడతా...  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)