Breaking News

విద్యుత్‌ ఉద్యోగులకు ప్రమాద బీమా రూ.కోటి

Published on Wed, 06/11/2025 - 01:25

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగులకు ప్రమాద బీమా కింద రూ. కోటి చెల్లించేలా ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన సమక్షంలో బ్యాంకర్లతో విద్యుత్‌ సంస్థలు ప్రమాద బీమా ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల్లో పని­చేస్తున్న దాదాపు 52 వేల మంది ఉద్యోగులకు ఈ ప్రమాద బీమా వర్తించనుంది. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్ర­మాద బీమా కింద ఉద్యోగులు పైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.80 లక్ష­ల పరిహారం అందుతుందని తెలిపారు. ఉద్యోగి సహజ మర­ణం చెందితే రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుందని, ఉద్యోగితోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి 20 లక్షల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుందని వివరించారు. 

త్వరితగతిన ‘యాదాద్రి’ పూర్తికి భట్టి ఆదేశం:  యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. త్వరితగతిన ప్లాంట్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ను ఆదేశించారు. ప్రతి వారానికి ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులను సోమవారం పరిశీలించి వచ్చిన బీహెచ్‌ఈఎల్‌ సీఎండీ, డైరెక్టర్లు, టీజీ జెన్‌కో సీఎండీ అక్కడ జ­రు­గుతున్న పనుల పురోగతిని భట్టికి వివరించారు. 

యూని­ట్‌–1, యూనిట్‌–2 పనులు విజయవంతంగా పూర్తయ్యాయని, మిగతా మూడు యూనిట్ల పనులు తుదిదశలో ఉన్నాయని చెప్పారు. అన్ని యూనిట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ప్రారంభమవుతాయన్నారు. కాగా ఇటీవల మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లు మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. ఇద్దరు కొత్త మంత్రులు ఆయన్ను సత్కరించారు. 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు