Breaking News

చిన్నారిని చితకబాదిన పాఠశాల ఆయా..

Published on Mon, 12/01/2025 - 10:38

హైదరాబాద్‌ : ఓ చిన్నారిని పాఠశాలలో పని చేస్తున్న ఆయా విచక్షణారహితంగా కొట్టిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారిని ఆయా కొడుతున్న వీడియో వెలుగులోకి రావడంతో హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన సంతోషి , కాలియో దంపతులు ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి షాపూర్‌నగర్‌లోని పూర్ణిమ స్కూల్‌లో ఉంటున్నారు. సంతోషి ఆయాగా పనిచేస్తుండగా సంతోష్‌ ఓ అట్టల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. 

అదే పాఠశాలలో సంతోషి కుమార్తె (4) నర్సరీ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం అదే పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న లక్ష్మి చిన్నారిని మూత్రశాల వద్దకు తీసుకువచి్చంది. అనంతరం చిన్నారిని దుస్తులు మార్చుకోవాలని ఆయా చెప్పగా చిన్నారి మార్చుకోలేక పోవడంతో ఆగ్రహానికి లోనైన  ఆయా లక్ష్మి చిన్నారిని చితకబాదింది. చిన్నారి జుట్టు పట్టి  కొట్టింది చిన్నారి ఏడుపు విన్న పక్కింటి యువకుడు ఈ ఘటనను వీడియో తీశాడు. సదరు వీడియో వైరల్‌ కావడంతో చిన్నారి తల్లిదండ్రులు జీడిమెట్ల పీఎస్‌లో పిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పాఠశాల ఆయాతో పాటు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)