Breaking News

పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 94.57 శాతం పాస్‌

Published on Sat, 08/10/2024 - 02:51

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్‌ కాలేజీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగేట్‌) ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి విడుదల చేశారు. సెట్‌లో 94.57 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 45 కోర్సులకు సంబంధించిన ఈ సెట్‌ను గత నెల 6 నుంచి 16వ తేదీ వరకూ నిర్వహించారు. 73,342 మంది పరీక్షకు దరఖాస్తు చేస్తే, 64,765 మంది పరీక్షకు హాజరయ్యారు.

వీరిలో 61,246 మంది (94.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పీజీ సెట్‌ పరీక్ష రాసిన వారు, అర్హత సాధించిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. బాలురు 21,757 మంది పరీక్ష రాస్తే, 20,569 మంది పాసయ్యారు. బాలికలు 43,008 మంది రాస్తే 40,677 మంది పాసయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ మహమూద్, ఉస్మానియా యూనివర్సిటీ రిజి్రస్టార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్, సెట్‌ కనీ్వనర్‌ పాండు రంగారెడ్డి పాల్గొన్నారు. 

12 నుంచి కౌన్సెలింగ్‌: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 12 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు సెట్‌ కనీ్వనర్‌ పాండురంగారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు సరి్టఫికెట్లను ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్‌ కోసం అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. కాలేజీల్లో చేరేటప్పుడు మాత్రమే ఒరిజినల్‌ సరి్టఫికెట్లు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 42,192 పీజీ సీట్లున్నాయని, ఈ సంవత్సరం మరో 2 వేల సీట్లు అదనంగా వచ్చే వీలుందని తెలిపారు. 278 కాలేజీలు కౌన్సెలింగ్‌ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)