Breaking News

తగ్గేదేలే! 91 ఏళ్ల వయసులోనూ కష్టానికి కట్టుబడి

Published on Mon, 11/24/2025 - 13:43

సూర్యాపేట జిల్లా: తొమ్మిది పదుల వయస్సు దాటినా నవ యువకుడిలా జీవనం సాగిస్తున్నాడు ఆ వృద్ధుడు. అరవై ఏళ్లు దాటితేనే కాళ్ల నొప్పులతో బాధపడుతూ అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి కొందరిది. అలాంటిది 91 ఏళ్ల వయస్సులోనూ స్వతహాగా తన పనులు తాను చేసుకుంటూనే సైకిల్‌ తొక్కుతూ వీధివీధి తిరుగుతూ కూరగాయలు అమ్ముతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు తేజావత్‌ గనియా. చిలుకూరు మండలం సీత్లాతండాకు చెందిన తేజావత్‌ గనియాకు ఏడుగురు సంతానం (నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు). తనకున్న రెండెకరాల భూమిలో వరితోపాటు కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తూ వాటిని అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. ఈయన పిల్లలందరూ వివిధ ఉద్యోగాల్లో సిర్థరపడగా ఇందులో ఒకరైన బావసింగ్‌ ఇటీవలే హెచ్‌ఎంగా రిటైర్‌ అయ్యారు.

రోజూ 20 కిలోమీటర్లు సైకిల్‌పై తిరుగుతూ..
90 ఏళ్ల వయస్సు దాటినా, పిల్లలు ప్రయోజకులైనా గనియా మాత్రం నేటికీ కూరగాయలు అమ్మే వృత్తిని మాత్రం వదులుకోలేదు. ప్రతిరోజూ ఉదయం 5 గంటల కల్లా లేవడం సుమారుగా 20 కిలోమీటర్ల మేర సైకిల్‌పై తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నాడు. తన పొలంలో కూరగాయలు పండని సమయంలో కోదాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయలను కొనితెచ్చి గ్రామాల్లో తిరుగుతూ అమ్మడం ఆయన దినచర్య. నేటికీ బీపీ, ఘగర్‌ లాంటివి లేకుండా వృద్ధాప్యంలోనూ ఒకరిపై ఆధారపడకుండా తన భార్యతో కలిసి జీవిస్తూ చేతనైనా పనిచేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు గనియా. ఇటీవల అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్‌లో గనియాను జిల్లా కలెక్టర్‌ ఘనంగా సన్మానించారు.

పనిచేయడం వల్లే ఆరోగ్యంగా ఉన్నా
నిత్యం నా పనులు నేను చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పటి వరకు బీపీ, షుగర్‌ లాంటివి లేవు. రోజూ సైకిల్‌ తొక్కుతున్నా ఎలాంటి కాళ్ల నొప్పులు లేవు. ఎన్నో ఏళ్ల నుంచి సైకిల్‌పైనే కూరగాయలు అమ్మతున్నాను. ఇప్పటికీ ఆ వృత్తిని వదులుకోలేకపోతున్నా.

– తేజావత్‌ గనియా, సీత్లాతండా, చిలుకూరు మండలం

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)