Breaking News

శివాజీరావు 90.0

Published on Sat, 07/06/2024 - 11:20

రామంతాపూర్‌: కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని సోమరిపోతులైన యువకులను ఉద్దేశించి అన్నాడో మహా కవి. దానిని సవరించుకుంటూ కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు అని శివాజీరావును చూస్తే అనిపిస్తుంది. 90 ఏళ్ల వయస్సులో మనకు తెలిసి చాలా మంది మంచానికే పరిమితమైపోతారు. అనేక అనారోగ్య సమస్యలో ఇబ్బందిపడుతుంటారు.  కాని శివాజీరావును చూసిన వారెవరైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే.. ఎందుకంటే ఇప్పటికీ బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, కళ్లు మసకబారడం వంటి సమస్యలేవీ ఆయన దరిదాపుల్లోకి రాలేకపోయాయి అంటే ఆశ్చర్యపోతారేమో! 

మెదక్‌ జిల్లా జహీరాబాద్‌కు చెందిన శివాజీరావు 30 ఏళ్ల కిందట రామంతాపూర్‌ శారదానగర్‌కు తన కుటుంబంతో సహా వచ్చి స్థిరపడ్డారు. శారదానగర్‌ ప్రధాన రహదారిలో చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు.   ఈ వయస్సులో కూడా ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ చెప్పులు కుట్టే పనిలో బిజీగా ఉంటారు. మధ్యాహ్నం ఓ గంట సేపు నిద్రపోతారు. స్కూల్‌ పిల్లల షూస్, దివ్యాంగుల చెప్పులకు మాత్రం సగం రేటే తీసుకుంటారు.

ఆరోగ్య రహస్యం నడక, జొన్నరొట్టే.. 
ఈ వయసులో కూడా తాను చెప్పులు కుట్టే వృత్తి నిర్వహిస్తున్నారు. తన వ్యాపారానికి కావాల్సిన ముడి సరుకులు బస్సులో వెళ్లి తెచ్చుకుంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటని ప్రశి్నస్తే నడక మూడు పూటలా జొన్న రొట్టెను ఆహా రంగా తీసుకుంటానని, ఉన్న దాంట్లో తృప్తిగా బతకడమే అని సమాధానం ఇచ్చారు. రామంతాపూర్‌లో నడక ప్రారంభించి పాలిటెక్నిక్‌ కాలేజ్‌ వరకూ నడుస్తానని తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)