Breaking News

ఒక్క మద్యం షాపు.. 34 దరఖాస్తులు

Published on Mon, 10/20/2025 - 04:11

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి ఒక్కో వైన్‌షాపు కోసం సగటున 34 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2025–27 సంవత్సరాలకు గాను రాష్ట్రంలోని 2,620 వైన్‌ (ఏ4) షాపుల నిర్వహణ కోసం లైసెన్సులు మంజూరు చేసేందుకు తొలి విడత గడువు ముగిసే సమయానికి మొత్తం 89,344 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ శాఖ అధికారికంగా వెల్లడించింది. తద్వారా దరఖాస్తు ఫీజు రూపంలో మొత్తం రూ.2,680 కోట్లు సమకూరింది. ఇది గత రెండేళ్ల కాలానికి దరఖాస్తు ఫీజు రూపంలో వచ్చిన దాని కంటే కొంచెం ఎక్కువ కావడం గమనార్హం.

కాగా, ఈ దరఖాస్తు గడువును ఎక్సైజ్‌ శాఖ మరో మూడు రోజులు పెంచింది. ఈనెల 23 వరకు మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈనెల 23న జరగాల్సిన డ్రాలు ఈనెల 27న తీస్తామని ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే అత్యధికంగా శంషాబాద్‌ ఎక్సైజ్‌ జిల్లాలో 8 వేలకు పైగా వచ్చాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో కేవలం 622 దరఖాస్తులు మాత్రమే రాగా, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 4,620 దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. 

ఎక్సైజ్‌ జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలివి..
ఆదిలాబాద్‌ (711), ఆసిఫాబాద్‌ (622), మంచిర్యాల (1,617), నిర్మల్‌ (942), హైదరాబాద్‌ (2,960), సికింద్రాబాద్‌ (2,787), జగిత్యాల (1,834), కరీంనగర్‌ (2,635), పెద్దపల్లి (1,378), సిరిసిల్ల (1,324), ఖమ్మం (4,094), కొత్తగూడెం (3,799), గద్వాల (723), మహబూబ్‌నగర్‌ (2,360), నాగర్‌కర్నూల్‌ (1,424), వనపర్తి (676), మెదక్‌ (1,369), సంగారెడ్డి (4,190), సిద్దిపేట (2,642), నల్లగొండ (4,620), సూర్యాపేట (2,617), భువనగిరి (2,649), కామారెడ్డి (1,444), నిజామాబాద్‌ (2,633), మల్కాజ్‌గిరి (4,879), మేడ్చల్‌ (5,203), సరూర్‌నగర్‌ (7,595), శంషాబాద్‌ (8,110), వికారాబాద్‌ (1,750), జనగామ (1,588), భూపాలపల్లి (1,658), మహబూబాబాద్‌ (1,674), వరంగల్‌ రూరల్‌ (1,825), వరంగల్‌ అర్బన్‌ (3,012).  

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)