Breaking News

ఇంజనీరింగ్‌లో 77,561 సీట్ల భర్తీ

Published on Sat, 07/19/2025 - 05:26

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో 77,561 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 5,493 సీట్లు మిగిలిపోయాయి. 82 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. 6,083 మందికి ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద సీట్లు వచ్చాయి. తక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల 16,793 మంది సీట్లు పొందలేకపోయారు. ఈఏపీసెట్‌ మొదటి విడత సీట్ల కేటాయింపు శుక్రవారం చేపట్టారు. ఆ వివరాలను సాంకేతిక విద్య విభాగం వెల్లడించింది.

రాష్ట్రంలో 172 కాలేజీల్లో 83,054 ఇంజనీరింగ్‌ సీట్లు ఉన్నాయి. వీటి కోసం 94,354 మంది విద్యార్థులు 59,31,279 ఆప్షన్లు ఇచ్చారు. ఈసారి కొత్తగా మాక్‌ సీట్ల కేటాయింపు చేపట్టారు. దీని తర్వాత విద్యార్థులు ఆప్షన్లు మార్చుకున్నారు. మాక్‌తో పోలిస్తే 36,544 ఆప్షన్లు మారాయి. ఇందులో కొంతమంది కాలేజీలు మార్చుకుంటే, మరికొందరు బ్రాంచీలు మార్చుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి.  తొలిసారిగా ఎస్సీ కుల వర్గీకరణ ప్రకారం ఇంజనీరింగ్‌ సీట్లు కేటాయించారు.

కంప్యూటర్‌ కోర్సులదే ఆధిపత్యం: మొదటి విడతలో 77,561 సీట్లు భర్తీ అయితే, ఇందులో 57,042 సీట్లు కంప్యూటర్, ఇతర ఎమర్జింగ్‌ కోర్సుల్లోనే ఉన్నాయి. ఈ విభాగంలో 1,700 సీట్లు మాత్రమే మిగిలిపోయాయి. ప్రధాన ప్రాధాన్యత ఎమర్జింగ్, కంప్యూటర్‌ బ్రాంచీలే అయినా... ఈసారి కోర్‌ గ్రూపుల వైపు విద్యార్థులు ఎక్కువగా మొగ్గారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో 16,112 సీట్లు ఉంటే, 14,054 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్‌లో అన్నింటికన్నా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. అయినప్పటికీ గతంతో పోలిస్తే కొంత మెరుగే కనిపించింది. గత ఏడాది ఈ బ్రాంచీల్లో 40 శాతం సీట్లు కూడా భర్తీ అవ్వలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)