Breaking News

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 75 పీజీ సీట్లు

Published on Mon, 11/03/2025 - 04:50

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 75 పీజీ సీట్లను కేటాయిస్తూ నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా వైద్య కళాశాలతోపాటు మరో ఆరు ప్రభుత్వ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో కొత్త సీట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా కాలేజీలో హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో 4 సీట్లు మంజూరు చేసిన ఎన్‌ఎంసీ.. నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో 8 సీట్లు, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో నాలుగు పీజీ సీట్లను మంజూరు చేసింది.

కొత్తగా ఏర్పాటైన సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ, రామగుండం వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున పీజీ సీట్లు కేటాయించడం విశేషం. పెరిగిన సీట్లకు ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు జరగనున్నాయి. 75 సీట్లు పెరగడంతో రాష్ట్రంలో స్పెషాలిటీ డాక్టర్ల సంఖ్య పెరిగి మరింత నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,983 పీజీ వైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,472 పీజీ సీట్లు ఉండగా వాటికి 75 సీట్లు అదనంగా కలవనున్నాయి. దీంతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్య 1,547కు పెరగనుంది. వాటిలో 50 శాతం అఖిల భారత కోటా కింద పోగా మిగతా 50 శాతం అంటే 773 సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకే లభించనున్నాయి.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)