Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలు 

Published on Mon, 04/17/2023 - 01:39

కరీంనగర్‌రూరల్‌: యాసంగి పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7,100 కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ మండలం చెర్లభూత్కూర్, మొగ్దుంపూర్‌ గ్రా మాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్‌ సప్లైచైర్మన్‌ రవీందర్‌సింగ్‌తో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ రెండో పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

యాసంగి పంట ముందుగా కోతకు రావడంతో సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కేంద్రాలను ఏర్పాటు చేయ నున్నామని, ఇప్పటివరకు 420 కేంద్రాలను ఏర్పా టు చేసి రూ.4.15కోట్ల విలువైన 2వేల మెట్రిక్‌ ట న్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. అవ సరమైన ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించేందు కు కలెక్టర్లకు ఆదేశాలిచి్చనట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి సురేశ్‌ పాల్గొన్నారు.

మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం 
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. కరీంనగర్‌ మండలం చెర్లభూత్కూర్‌లో ఆదివారం కొందరు చిరుతల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం శ్రీసీతారాముల పట్టాభిõషేకం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మంత్రి గంగుల హాజరై వేదికపైకి చేరుకున్నారు. ఆయనతోపాటు సివిల్‌ సప్లైచైర్మన్‌ రవీందర్‌సింగ్‌ కూడా ఉన్నారు.

అయితే అప్పటికే పెద్దసంఖ్యలో మహిళలు వేదికపైకి ఉన్నారు. గంగుల, రవీందర్‌సింగ్‌తోపాటు స్థానిక నాయకులు వేదికపైకి వెళ్లడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో మంత్రి గంగుల కమలాకర్‌ ఎడమకాలుకు గాయమైంది. రవీందర్‌సింగ్, జెడ్పీటీసీ లలిత స్వల్పంగా గాయపడ్డారు. పడిపోయిన మంత్రి వెంటనే గన్‌మెన్లు, నిర్వాహకులు పైకి లేపి ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)