చిన్న కుటుంబాల్లోనే కలహాలు ఎక్కువ

Published on Tue, 12/10/2024 - 03:39

సాక్షి, హైదరాబాద్‌: ‘వివాహ బంధంలో జంటల మధ్య కలహాలు ఎక్కువగా చిన్న కుటుంబాల్లోనే (న్యూక్లియర్‌ ఫ్యామిలీ)ఉంటున్నాయి. కుటుంబ కలహాలకు సంబంధించిన కేసుల్లో 70 శాతం చిన్న కుటుంబాల నుంచి వచ్చి నవే’అని మహిళా భద్రత విభాగం డీజీ శిఖాగోయల్‌ తెలిపారు. 42 శాతం సమస్యలు వివాహమైన మొదటి 0–5 సంవత్సరాల్లో సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.

గృహహింస కేసుల పరిష్కారం, సయోధ్య పెంచడంలో తెలంగాణ పోలీస్‌ మహిళా భద్రత విభాగం ఏర్పాటు చేసిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ (సీడీఈడబ్ల్యూ) గణనీయమైన పురోగతిని సాధిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని 27 సీడీఈడబ్ల్యూ సెంటర్లలో మొత్తం 9 వేల కేసులు వచ్చాయన్నారు. కౌన్సెలింగ్‌ సెషన్‌ల ద్వారా 8,200 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. సీడీఈడబ్ల్యూకు వచ్చిన కేసుల్లో సేకరించిన వివరాలను విశ్లేషించగా..గుర్తించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి  

⇒ గృహహింస కేసులకు ప్రధాన కారణాలు మద్యపాన వ్యసనం (63.2 %), ఆర్థిక ఒత్తిడి (50%), అనుమానం (48 %), వివాహేతర సంబంధాలు (33% ).  
⇒ పదేపదే గృహహింసకు గురవుతున్న మహిళలు 22 % మంది ఉంటున్నారు.  
⇒ గృహహింస కేసులు నమోదవుతున్న కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి. కేసులు నమోదైన 50% కుటుంబాలు నెలకు రూ.11,000 నుంచి రూ. 30,000 మధ్య సంపాదన కలిగినవే. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)