Breaking News

హైదరాబాద్‌లో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

Published on Sat, 07/20/2024 - 17:16

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. శంషాబాద్‌లో దాదాపు కేజీ హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు..

వివరాలు.. నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న శంషాబాద్‌ ఎస్‌ఓటీ, మాదాపూర్‌ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. రాజస్థాన్‌కు చెందిన నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. 7 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో హెరాయిన్‌ పట్టుబడటం ఇదే తొలిసారి అని తెలిపారు. కేజీకి పైగా హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రధాన డ్రగ​్‌ పెడ్లర్‌ నేమి చాంద్‌ భాటితోపాటు నార్పట్ సింగ్, అజయ్ భాటి, హరీష్ సిర్వి, సంతోష్ ఆచార్య అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

వీరంతా రాజస్థాన్ నుంచి బస్‌లో డ్రగ్స్ తీసుకొచ్చారని సీపీ తెలిపారు.స్వీట్ బాక్సుల్లో పైన స్వీట్స్ పెట్టి.. కింద 250గ్రా. హెరాయిన్ ఉంచి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోనే  హెరాయిన్ ఎక్కువగా తయారు అవుతోందని.. ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)