Breaking News

‘ట్రాఫిక్‌’కు పోలీసు బకాయి రూ.68 లక్షలు!

Published on Fri, 06/13/2025 - 11:13

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగర పోలీసు విభాగానికి చెందిన వాహనాలు సైతం ఎడాపెడా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. వీటిని ట్రాఫిక్‌ విభాగం అధికారులు గుర్తించి జారీ చేసిన ఈ–చలాన్ల బకాయిలు భారీగానే ఉన్నాయి. ఈ జరిమానాల చెల్లింపు విషయంలో మాత్రం ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. రహదారి నిబంధనలపై అవగాహనకు కృషి చేస్తున్న నగరవాసి లోకేంద్ర సింగ్‌ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలను వెలుగులోకి తెచ్చారు.

పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ–చలాన్లలో ఇప్పటికీ 17,391 పెండింగ్‌లో ఉన్నాయి. వీటి జరిమానా మొత్తం రూ.68 లక్షలని లెక్క తేలింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 210 బీ ప్రకారం ఆ చట్టాన్ని అమలు చేసే ఏ అధికారికి సంబంధించిన వాహనమైనా ఉల్లంఘనకు పాల్పడితే... సాధారణ జరిమానాకు రెట్టింపు విధించే అవకాశం ఉంది. ఆ కోణంలో లెక్కిస్తే జరిమానా మొత్తం రూ.1.36 కోట్లుగా పరిగణించవచ్చు. నగరంలోని రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను పోలీసు విభాగం ఈ–చలాన్ల రూపంలోనే జరిమానా విధిస్తోంది. చౌరస్తాలతోపాటు ఇతర కీలక ప్రాంతాల్లో ఉన్న కెమెరాలు, క్షేత్ర స్థాయిలో ఉండే పోలీసులు ఆ ఉల్లంఘనలను ఫొటోలు తీస్తారు.  

ఆటోమేటెడ్‌ కెమెరాలు గుర్తించి.. 
సాధారణంగా క్షేత్ర స్థాయి సిబ్బంది తమ విభాగానికి చెందిన వాహనాలు చేసే ఉల్లంఘనలపట్ల చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారు. అవి కంట పడినప్పటికీ ఫోటోలు తీయరు. అయితే ఓవర్‌ స్పీడింగ్‌ వంటి ఉల్లంఘనల్ని ఆటోమేటెడ్‌ కెమెరాలు గుర్తించి ఫొటోలు తీస్తాయి. దీంతో పోలీసు వాహనాలపైనా ఈ–చలాన్లు జారీ అవుతున్నాయి. ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సర్వర్‌కు ఆర్టీఏ డేటాబేస్‌ అనుసంధానించి ఉంటుంది. దీని ఆధారంగా ఆయా వాహన చోదకుల రిజిస్టర్డ్‌ చిరునామాలకు ఈ–చలాన్లు, రిజిస్టర్డ్‌ మెబైల్‌ నెంబర్లకు ఎస్సెమ్మెస్‌లు వెళ్తాయి.

అయితే పోలీసు విభాగానికి సంబంధించిన వాహనాలు అన్నీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) పేరుతోనే రిజిస్టరై ఉంటాయి. దీంతో ఈ ఈ–చలాన్లు కూడా ఆ పేరుతోనే జారీ అవుతాయి. ఆ వాహనం ఎవరు వినియోగిస్తున్నారో వారి చిరుమానాలు రికార్డుల్లో ఉండవు. ఈ కారణంగానూ పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ–చలాన్లలో అత్యధికం పెండింగ్‌లో ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ ఈ–చలాన్లను అన్ని రకాలైన ఉల్లంఘనలకు సంబంధించి ఉన్నాయని తెలుస్తోంది.

ఓవర్‌ స్పీడ్‌పైనే ఎక్కువ..
ఓవర్‌ స్పీడింగ్, రాంగ్‌ పార్కింగ్‌ తదితర ఉల్లంఘనలపై జారీ అయినవి ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వాహనాలపై గరిష్టంగా 15 చలాన్లు పెండింగ్‌లో ఉండగా... వీటిలో కొన్ని 2017 నాటివి కావడం గమనార్హం. అత్యంత ప్రముఖుల వాహనాలకు పైలెటింగ్, ఎస్కార్ట్‌ చేస్తున్న, ఆయా కాన్వాయ్‌లను అనుసరిస్తున్న పోలీసు వాహనాలు పరిమితికి మించిన వేగంతోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ కారణంగానూ కొన్నింటిపై ఈ–చలాన్లు జారీ అవుతున్నాయి. కాగా, గత ఏడాది ట్రాఫిక్‌ విభాగం అధికారులు మొత్తం 56.3 లక్షలు ఈ–చలాన్లు జారీ చేశారు. వీటిలో 46.6 లక్షలు చలాన్లకు సంబంధించిన జరిమానాను వాహన చోదకులు చెల్లించారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు