Breaking News

6.53 కిలోల భారతీయ పాంగోలిన్ స్కేల్స్‌ స్వాధీనం

Published on Sun, 10/05/2025 - 13:00

హన్మకొండ: చట్టవిరుద్ధంగా పాంగోలిన్ స్కేల్స్ వ్యాపారం నిర్వహిస్తున్న నిందితులను తెలంగాణలోని హన్మకొండలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 6.53 కిలోల భారతీయ పాంగోలిన్ స్కేల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పాంగోలిన్‌ అనేది చెదపురుగులను తినే ఒక ప్రత్యేక తరహా క్షీరదం. దీని పొలుసులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. సంప్రదాయ చైనీస్ వైద్యంలో పాంగోలిన్ స్కేల్స్‌ ఉపయోగిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా అక్రమంగా రవాణా చేసే క్షీరదాలలో పాంగోలిన్లు ఒకటి. కాగా చట్టవిరుద్ధంగా పాంగోలిన్ స్కేల్స్ వ్యాపారాన్ని కొందరు నిర్వహిస్తున్నారనే నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు తెలంగాణలోని హన్మకొండలో నిఘా వేసి, నలుగురు వ్యాపారులను పట్టుకున్నారు. వారి నుండి మొత్తం 6.53 కిలోల భారతీయ పాంగోలిన్ స్కేల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పాంగోలిన్‌లను ప్రధానంగా చైనా, ఆగ్నేయాసియాలో వేటాడుతుంటారు. వాటి విలువైన పొలుసుల కోసమే ఈ వేట సాగుతుంది. వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 షెడ్యూల్-Iలో జాబితాలో ఇండియన్ పాంగోలిన్ ఉండటంతో పాటు ఇటువంటి జంతువుల వేటపై నిషేధం అమలులో ఉంది. కాగా ఈ 6.53 కిలోల పొలుసులు సుమారు ఐదు భారతీయ పాంగోలిన్ల నుండి సేకరించారని అంచనా. కాగా వీటి వ్యాపారం నిర్వహిస్తున్న నిందితులను డీఆర్‌ఐ అధికారులు తదుపరి దర్యాప్తు కోసం హన్మకొండలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు అప్పగించారు.
 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు