Breaking News

615 ‘ఎలక్ట్రిక్ ’ చార్జింగ్‌ కేంద్రాలు! 

Published on Wed, 08/30/2023 - 01:37

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లా, మండల కేంద్రాలు, హైవేలపై 615 ప్రాంతాల్లో పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన సంస్థ(రెడ్కో) దరఖాస్తులను ఆహ్వానించింది.

రెడ్కో చూపించిన స్థలాల్లోనే ఫాస్ట్, స్లో చార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, విధివిధానాల కోసం హైదరాబాద్‌లోని తమ కేంద్ర కార్యాలయం/స్థానిక జిల్లా కార్యాలయాలను సందర్శించాలని రెడ్కో చైర్మన్‌ వై.సతీష్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ వెబ్‌సైట్‌ https:// tsredco.telangana.gov.in/  లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. 

దేశంలోనే తొలిసారిగా.. 
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో పీపీపీ విధానంలో చార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే యాదాద్రిలో ఏర్పాటు చేసిన తొలి చార్జింగ్‌ కేంద్రం విజయవంతంగా నడుస్తోందని సతీష్‌ రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహన వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా రాష్ట్రమంతటా చార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 2025 కల్లా 3000 ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రెడ్కో స్వయంగా 150 ఫాస్ట్‌ చార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిందని.. ఇందులో 90 కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయని వివరించారు.   

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)