ఇక్కడ తొలగించి..అక్కడ పెంచి..!

Published on Sun, 01/05/2025 - 04:55

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణంతో 56 వేల వృక్షాలు నేలకూలబోతున్నాయి. ఈ భాగం రోడ్డు అలైన్‌మెంటు పరిధిలో ఉన్నందున వీటిని తొలగించేందుకు అటవీ శాఖ అనుమతించింది. భారీ సంఖ్యలో వృక్షాలను తొలగించాల్సిరావటంతో పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో వాటి లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కోల్పోయిన చెట్లకు ప్రతిగా 3.30 లక్షల మొక్కలను పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే మహబూబాబాద్‌లో భూమిని ఎంపిక చేశారు.  

మూడు ప్రాంతాల్లో ఎక్కువ అటవీ భూములు 
ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగాన్ని నిర్మించే 162 కి.మీ. నిడివిలో మూడు ప్రాంతాల్లో అటవీ భూములు అడ్డు వస్తున్నాయి. అడవి గుండా రోడ్డు నిర్మిస్తే వన్యప్రాణుల సంచారానికి ఇబ్బందిగా మారుతుంది. దీంతో ఆయా అటవీ భూముల్లో ఏదో ఒక చివరి నుంచి అలైన్‌మెంటు సాగేలా కన్సల్టెన్సీ సంస్థ దృష్టి పెట్టింది. రోడ్డుకు ఓవైపు 95 శాతం అటవీ భాగం ఉంటే, మరోవైపు 5 శాతం వరకు మాత్రమే ఇతర భూమి ఉండేలా అలైన్‌మెంటును రూపొందించింది. గజ్వేల్, నర్సాపూర్, యాదాద్రి ప్రాంతాల్లో ఈ అటవీ భూములున్నాయి. 

మెదక్‌ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లా పరిధిలో 8.511 హెక్టార్లు.. వెరసి 72.3536 హెక్టార్ల మేర అటవీ భాగం అలైన్‌మెంటు పరిధిలోకి వచ్చింది. అంటే 200 ఎకరాలకు లోపు మాత్రమే ఉత్తర రింగు ప్రభావానికి గురికానున్నాయి. 

ఈ ప్రాంతాల్లో 44 వేల వృక్షాలను తొలగించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. దీంతో వాటిని తొలగించేందుకు ఇటీవల అటవీ శాఖ అనుమతించింది. ఇక అటవీ భూముల వెలుపల ఉండే సాధారణ భూముల్లోని మరో 12 వేల వృక్షాలను కూడా తొలగించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. వెరసి ఉత్తర భాగం పరిధిలో 56 వేల వృక్షాలను తొలగించబోతున్నారన్న మాట.  

పరిహారం స్థానంలో మొక్కల పెంపకం 
ప్రాజెక్టుల్లో కోల్పోయే అటవీ భూములకు కూడా పరిహారం ఇచ్చే విధానం గతంలో అమల్లో ఉండేది. అయితే మోదీ ప్రభుత్వం.. పరిహారానికి బదులు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి వాటిల్లో మొక్కలను పెంచాలని నిర్ణయించింది. ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణానికి ఇప్పుడదే వర్తింపజేస్తున్నారు. 

మహబూబాబాద్‌ జిల్లాలో ప్రత్యామ్నాయ భూమి కేటాయించారు. కొత్తగూడ మండలం పరిధిలోని పొగుళ్లపల్లి, నీలంపల్లి, గంగారం మండలం పరిధిలోని చింతల్‌గూడ గ్రామంలో ఈ భూమిని గుర్తించారు. ఈ మూడు గ్రామాల పరిధిలో కలిపి 3,29,452 చెట్లు పెరిగేలా త్వరలో మొక్కలు నాటనున్నారు.  

జంతువులకు ఇబ్బంది కలుగకుండా ఎకో బ్రిడ్జీలు 
3 అటవీ ప్రాంతాల్లో జింకలు, దుప్పులు, నక్క లు, కోతులు, కొండముచ్చులు, నెమళ్లు, ఎలుగుబంట్లు కొన్ని ఇతర జంతువులు ఉన్నాయని గుర్తించారు. రోడ్డు నిర్మాణంతో వీటికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోనున్నారు. జంతువులు ఒకవైపు నుంచి రోడ్డు దాటి మరోవైపు వెళ్లేలా ఎకో బ్రిడ్జీలు (పర్యావరణ హిత వంతెనలు) నిర్మించనున్నారు. 

వీటివల్ల పైనుంచి వాహనాలు వెళ్తున్నా, జంతువులు దిగువ నుంచి మరోవైపు వెళ్లేందుకు, వచ్చేందుకు వీలవుతుంది. ఇక జంతు సంచారం మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాల శబ్దాలు వాటిని ఇబ్బంది పెట్టకుండా రోడ్డుకు రెండు వైపులా నాయిస్‌ బారియర్స్‌ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉంది.   

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)