Breaking News

కేన్సర్‌ రోగుల లెక్క తేల్చరా?

Published on Mon, 10/27/2025 - 01:29

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కేన్సర్‌ వ్యాధి అంతకంతకూ విస్తరిస్తోంది. ఏటా 55 వేల మందికిపైగా కేన్సర్‌ బారిన పడుతున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైన కేసులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్న చికిత్సల గణాంకాలతో వెల్లడవుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా కేన్సర్‌ రోగుల లెక్కలను సేకరించడంలేదు. నిబంధనల ప్రకారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదీనంలోని ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సరై్వలెన్స్‌ పోర్టల్‌ (ఐడీఎస్‌పీ)లో దేశవ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు, ప్రమాదకర రోగాలకు సంబంధించిన సమాచారాన్ని చేర్చాలి. తద్వారా ఆయా వ్యాధుల నివారణ, ముందు జాగ్రత్తలపై కేంద్రం నిఘా ఉంటుంది. ఆయా వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు, ఎక్కడెక్కడ ప్రబలుతున్నాయనే అంశాలపై కేంద్రానికి పరిశోధనలు జరిపే అవకాశం లభిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కేవలం అంచనాలకే పరిమితమవుతోంది. 

ఐడీఎస్‌పీలో నిరంతర పర్యవేక్షణ 
సీజనల్‌ వ్యాధులతోపాటు తాగునీరు, ఆహారం, దోమలు, ఇతర రోగాలకు సంబంధించిన గణాంకాలను ఐడీఎస్‌పీ ద్వారా కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించి ఆయా రోగాలపై నిరంతర నిఘా పెడుతుంది. డయేరియా, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్, కలరా, వంటి 12 రోగాలపై ‘ఎల్‌’కేటగిరీలో నిఘా కొనసాగిస్తుంది. వాటితోపాటు కుక్క కాటు, పాముకాటు, చికెన్‌పాక్స్, మీజిల్స్, ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సోకే వ్యాధులు, ఇతర గుర్తించని రోగాలకు సంబంధించి ‘ప్రిసంప్టివ్‌’విభాగంలో నమోదు చేసి ముందు జాగ్రత్త చర్యలు, పరిశోధనలు జరుపుతుంది. అలాగే సంబంధిత రాష్ట్రాలకు అవసరమైన మందులు, ఇతర సహకారాన్ని కూడా అందిస్తుంది.  

మంత్రి చెప్పినా పడని ముందడుగు .. 
రాష్ట్రంలో ఏటా 55 వేలకుపైగా కేన్సర్‌ కేసులు కొత్తగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకు ఓ కేన్సర్‌ డే కేర్‌ సెంటర్‌ (సీడీసీ)ను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కేన్సర్‌ స్క్రీనింగ్‌తోపాటు కీమోథెరపీ చికిత్స కూడా అందిస్తున్నారు. త్వరలో రీజనల్‌ కేన్సర్‌ సెంటర్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో కేన్సర్‌ చికిత్స అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 

లంగ్, బ్రెస్ట్, సరై్వకల్‌ కేన్సర్‌లే ఎక్కువగా రాష్ట్రంలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ వ్యాధులకు తొలిదశ నుంచే చికిత్స అందించడం ద్వారా కేన్సర్‌ మరణాలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే కేన్సర్‌ కేసులను ప్రతి వారం ఐడీఎస్‌పీలో నమోదు చేయాలని మంత్రి దామోదర గతంలో తన శాఖ సమీక్షలో ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ముందడుగు లేదు.   

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)