Breaking News

క్రెడిట్‌ కార్డుల స్వైపింగ్‌తో రూ.5 కోట్ల మోసం

Published on Thu, 02/09/2023 - 05:53

హిమాయత్‌నగర్‌: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా క్రెడిట్‌ కార్డుల నుంచి దాదాపు రూ.5కోట్ల సొమ్మును స్వైప్‌ చేసి..ఆ మొత్తం సొమ్ముతో పరారైన దమ్మాయిగూడకు చెందిన నవీన్‌ అనే యువకుడి భాగోతం కలకలం రేపుతోంది. స్వైప్‌ చేసి డబ్బులు ఇస్తాడని ఎదురుచూసీ చూసీ చివరికి మోసపోయామని భావించి దాదాపు 20మంది యువకులు పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజులుగా సిటీ సైబర్‌క్రైం, సీసీఎస్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివరాలిలా., 

మొబైల్‌ షోరూం స్వైప్‌ మిషన్‌ ద్వారా  
ఓ మొబైల్‌ షోరూంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న నవీన్‌ మొదట్లో తన స్నేహితులకు  క్రెడిట్‌కార్డును స్వైప్‌ చేసి కమీషన్‌ తీసుకోకుండా క్యాష్‌ ఇచ్చేవాడు. ఇలా అతనిపై నమ్మకం కుదరడంతో మిత్రబృందానికి అత్యాశకలిగింది. నవీన్‌ తమ నుంచి కమీషన్‌ తీసుకోవడం లేదు కాబట్టి మనమే క్రెడిట్‌కార్డులను సేకరించి పదిశాతం కమీషన్‌ చొప్పున క్యాష్‌ కావాల్సిన వారికి ఇద్దామనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

ఇలా సుమారు 20మంది యువకులు ఒక్కొక్కరు ఐదారు బ్యాంకుల నుంచి దాదాపు వంద క్రెడిట్‌కార్డులు సేకరించి పిన్‌ నంబర్లతో సహా ఒకేసారి నవీన్‌కు ఇచ్చారు. ఇన్ని కార్డులు ఒకేసారి ఇవ్వడంతో క్యాష్‌ ఇచ్చేందుకు అతను వారం గడువు అడిగాడు. అయితే వారం కాదు.. రెండు వారాలు గడిచినా పత్తా లేకపోవడం... ఈలోగా తమ కార్డుల నుంచి స్వైప్‌ చేస్తున్నట్టు ఫోన్లలో మెసేజ్‌లు రావడంతో యువకులు పోలీసులను ఆశ్రయించారు. కాగా, తాను ఒక్కడినే రూ.కోటి డబ్బు కావాలని కార్డులు ఇచ్చినట్లు ఓ బాధితుడు రవి చెప్పుకొచ్చారంటే ఏ స్థాయిలో మోసం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)