Breaking News

499 కిలోల గంజాయి పట్టివేత

Published on Tue, 10/14/2025 - 04:44

సుజాతనగర్‌: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక అటవీ ప్రాంతంలో కొనుగోలు చేసి రాజస్తాన్‌లోని జైపూర్‌కు తరలిస్తున్న 499 కిలోల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. సరుకు విలువ రూ.2.50 కోట్లు ఉంటుందని ఎస్పీ రోహిత్‌రాజ్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కంటైనర్‌లో గంజాయి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు సుజాతనగర్‌ ఎస్సై రమాదేవి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. 

ఈ క్రమంలో కంటైనర్‌లో రవాణా చేస్తున్న 96 గంజాయి ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్నారు. కంటైనర్‌ యజమాని సంజుకుమార్, మహారాష్ట్రకు చెందిన జగదీశ్‌ దయారాంను అరెస్ట్‌ చేశామని, వీరితో సంబంధం ఉన్న అమిత్‌ రోహిదాస్‌ పాటిల్‌ (మహారాష్ట్ర), హరి (ఒడిశా) పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. అరెస్టైన ఇద్దరిపై గతంలో కూడా పాడేరు, ఔరద్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 59 మంది నుంచి రూ.25.85 కోట్ల విలువైన 52 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్‌ రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)