Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఖరీదైన 415 మద్యం బాటిళ్లు స్వాధీనం

Published on Fri, 09/06/2024 - 04:22

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌ : గోవా నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ఖరీదైన నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను ఎక్సైజ్‌ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్‌ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గోవా నుంచి మూడు విమానాల్లో మద్యం వస్తుందనే సమాచారం మేరకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరైక్టర్‌ వీబీ.కమలాసన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ పి.దశరథ్‌ అదేశాలతో ఏఈఎస్‌ జీవన్‌కిరణ్‌ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ అధికారులు రంగంలోకి దిగారు.

 ఎస్‌టీఎఫ్‌ సీఐలు సుబాష్‌ చందర్‌రావు, చంద్రశేఖర్, డీటీఎఫ్‌ సీఐ ప్రవీణ్, శంషాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ దేవేందర్‌రావుతోపాటు ఎస్సైలు, సిబ్బంది కలిసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఎయిర్‌పోర్ట్‌ అధికారుల సహకారంతో మద్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. 415 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 12 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.  

జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, సరూర్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన ఆర్‌ఎంపీలు గోవాలోని ఓ సదస్సుకు వెళ్లారు. వీరంతా తిరుగు ప్రయాణంలో మద్యం తీసుకొస్తున్నట్టు సమాచారం అందింది. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ తెచ్చిన నేరం కింద ఎక్సైజ్‌ ఈఏఎస్‌ జీవన్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో శంషాబాద్‌ సీఐ దేవేందర్‌రావు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.  

‘చంఢీగడ్‌’మద్యం సీజ్‌
చండీగఢ్‌ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా చేరిన మద్యాన్ని ఎక్సైజ్‌ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ముషీరాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ రామకృష్ణ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మెట్రోసేషన్‌ సమీపంలో రూ.3.85 లక్షల విలువ చేసే 72 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)