Breaking News

ట్రిపుల్‌ ఆర్‌ వరకు హైదరాబాద్‌ విస్తరణ

Published on Thu, 03/13/2025 - 04:19

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పరిధిని రీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో వెలువరించింది. దీంతో ఇప్పటివరకు 7,257 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధి 10,472.723 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో పాటు కొత్తగా నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్‌ జిల్లాలతో కలుపుకొని మొత్తం 11 జిల్లాలకు విస్తరిస్తుంది. 

మొత్తం 1,355 గ్రామాలు, 104 మండలాలు సంస్థ పరిధిలోకి వస్తాయి. మరోవైపు ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పరిధిలోకి తెచ్చారు. రీజినల్‌ రింగ్‌రోడ్డు తరువాత 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా నిర్ణయించారు. హైదరాబాద్‌ చుట్టూ 354 కిలోమీటర్ల పరిధిలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

ప్రగతి పరుగులు! 
అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహానగరం పరిధిని రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరించడం వల్ల ప్రగతి పరుగులు పెడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని కోర్‌ అర్బన్‌ ప్రాంతంగా పరిగణిస్తూ సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల వరకు జీహెచ్‌ఎంసీని విస్తరిస్తారు. 

ఆ తర్వాత ఔటర్‌ నుంచి రీజినల్‌ రింగ్‌రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా పరిగణిస్తూ శాటిలైట్‌ టౌన్‌షిప్పులు, ఇతర మౌలిక సదుపాయాలతో నగరాన్ని విస్తరించనున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు తరువాత ఉన్న తెలంగాణను రూరల్‌ తెలంగాణగా పరిగణించి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలనేది ప్రభుత్వ  లక్ష్యం. ఈ మేరకు సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ కోసం కూడా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం త్వరలో అంతర్జాతీయ కన్సల్టెన్సీల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)