Breaking News

బాలాపూర్‌ లడ్డూకు రికార్డు ధర.. 35లక్షలకు ఎవరు కొన్నారంటే?

Published on Sat, 09/06/2025 - 10:56

సాక్షి, బాలాపూర్‌: బాలాపూర్‌ లడ్డూకు మరోసారి రికార్డు స్థాయిలో వేలం జరిగింది. ఈ ఏడాది గణేషుడి లడ్డూ ఏకంగా రూ.35 లక్షలు పలికింది. ఈరోజు జరిగిన వేలంలో లింగాల దశరథ్‌ గౌడ్‌ బాలాపూర్‌ గణనాథుడి లడ్డూను దక్కించుకున్నారు. 

ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా బాలాపూర్‌ లడ్డూ కోసం పోటాపోటీగా వేలం జరిగింది. ఈ ఏడాది వేలంలో 38 మంది తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇక, ఈసారి వేలంలో లడ్డూ రూ.35 లక్షలు పలికింది. బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూను కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథగౌడ్ దక్కించుకున్నారు. అనంతరం, లడ్డూ విజేత లింగాల దశరథగౌడ్‌ను ఉత్సవ కమిటీ సన్మానించింది. గతేడాది కంటే రూ.4.99 లక్షల ధర అధికంగా పలికింది. ఈ సందర్భంగా దశరథ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా చాలా ఉంది. గత ఐదేళ్లుగా లడ్డూ కోసం ప్రయత్నిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. 

  • 31 ఏళ్లుగా బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట జరుగుతోంది. 
  • 1994 నుంచి బాలాపూర్‌లో కొనసాగుతున్న గణేశ్ లడ్డూ వేలంపాట
  • గతేడాది రికార్డుస్థాయిలో 30.01 లక్షలు ధర పలికింది. 
  • 2023లో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ
  • 2022లో రూ.24.60 లక్షలు పలికిన లడ్డ
  • 2021లో రూ. 18.90 లక్షలు, 
  • 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి
  • 2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
  • 2016లో రూ. 14. 65 లక్షలు, 2017లో రూ. 15.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
  • 1994లో రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)