Breaking News

ఒకేసారి 3 గ్రూప్స్‌ ఉద్యోగాలు

Published on Mon, 09/29/2025 - 10:03

జోగులాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్స్‌ ఫలితాల్లో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన ఎం.జ్యోత్స్న ఒకేసారి గ్రూప్‌–2, 3, 4 ఉద్యోగాలు సాధించింది. జ్యోత్స్న ఇంటర్‌ చదువుతున్న సమయంలో 2017లో తల్లి, తండ్రి ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతిచెందారు.  అమ్మమ్మ గ్రామమైన మల్దకల్‌ మండలం ఎల్కూరులో 9వ తరగతి వరకు, 10వ తరగతి ఉలిందకొండలో, డోన్‌లో ఇంటర్‌ చదివింది. 

ఇంటర్‌లో 970 మార్కులు సాధించిన జ్యోత్స్న ఢిల్లీలో అంబేడ్కర్‌ యూనివర్సిటీలో ఓపెన్‌ కేటగిరిలో సీటు రావడంతో 2021 వరకు అక్కడ చదివింది. చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన రవితో వివాహమైంది. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే గ్రూప్స్‌కు ప్రిపేరయ్యింది. ముందుగా గ్రూప్‌–4లో బీసీ వెల్‌ఫేర్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా జాబ్‌ వచి్చంది. అనంతరం గ్రూప్‌–3లో, గ్రూప్‌–2లో పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో మండల పంచాయతీ ఆఫీసర్‌ (ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌)గా ఉద్యోగం సాధించింది. 

కుటుంబ సభ్యుల సహకారంతోనే.. 
నేను ఈ స్థాయిలో ఉండేందుకు మా కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉంది. ఏడాది వయస్సున్న బాబును ఇంటి వద్ద వదిలి హైదరాబాద్‌కు వెళ్లి చదువుకున్నాను. దీని వెనక నా కృషి, పట్టుదల ఎంతో ఉంది. ముఖ్యంగా భర్త రవి సహకారంతోపాటు అత్త, మామ, బావ, తోటికోడలు సహకరించారు. 
 ఎం.జ్యోత్స్న, చిన్నతాండ్రపాడు  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)