Breaking News

2024లో 27 సాధారణ సెలవులు 

Published on Wed, 12/13/2023 - 04:53

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే సంవత్సరంలో 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు సాధారణ, ఐచ్చిక సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ సాధారణ సెలవులు, ఐచ్చిక సెలవులను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

అన్ని ఆదివారాలు, అన్ని రెండో శనివారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసి ఉంచాలని ఆదేశించారు. 2024 జనవరి 1న సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం (ఫిబ్రవరి 10) రోజును పనిదినంగా  పాటించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 25 ఐచ్ఛిక సెలవుల్లో గరిష్టంగా 5 సెలవులను మాత్రమే వినియోగించాలని కోరారు. తమ ఇష్టాలకు అనుగుణంగా మతాలతో సంబంధం లేకుండా ఏదైనా పండుగకి సంబంధించిన ఐచ్చిక సెలవును ఉద్యోగులు వాడుకోవచ్చని తెలిపారు.

అయితే దీనికోసం పైఅధికారికి ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు వర్తించవని స్పష్టం చేశారు. సంబంధిత సంస్థలే సెలవులపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయన్నారు. నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాల సెలవులను తర్వాత మారుస్తామని తెలిపారు. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)