Breaking News

ఆర్టీసీ ‘చలాన్‌’ బకాయి రూ.కోటి

Published on Sun, 02/09/2025 - 05:48

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఉల్లంఘనలో ప్రైవేట్‌ వాహనాలతో ఆర్టీసీ బస్సులు పోటీ పడుతున్నాయి. టీజీఎస్‌ఆర్టీసీ బస్సులపై ఏటా ట్రాఫిక్‌ పోలీసులు వేల సంఖ్యలో ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. 2022 నుంచి గత నెల 27 వరకు ఆర్టీసీ బస్సులకు 25,609 ఈ–చలాన్లు జారీ చేశారు. వీటికి సంబంధించి ఆర్టీసీ రూ.కోటికి పైగా చెల్లించాల్సి ఉంది. స్వచ్ఛంద సంస్థ యుగాంతర్‌ ఫౌండేషన్‌కు చెందిన యూఆర్టీఐ సంస్థ సమాచార హక్కు చట్టం కింద ట్రాఫిక్‌ పోలీసు విభాగం నుంచి ఈ సమాచారం సేకరించింది.  

ప్రయాణీకుల కోసమే ఉల్లంఘనలు..
ఆర్టీసీ బస్సుల ట్రాఫిక్‌ ఉల్లంఘనల్లో ఎక్కువగా ప్రయాణికుల కోసం చేస్తున్న పొరపాట్లే ఉంటున్నాయి. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ బస్సులు ఆపడం, బస్‌బేలను పట్టించుకోకపోవడం, స్టాప్‌లైన్‌ క్రాసింగ్, ఫ్రీ లెఫ్ట్‌ వయలేషన్‌ వంటి ఉల్లంఘనలపై పోలీసులు అధికంగా చలాన్లు విధిస్తున్నారు. కొందరు ప్రయాణికులు ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపాలని కోరుతున్నారు.]

సంస్థ ఆదాయం గురించి ఆలోచిస్తున్న డ్రైవర్లు.. చెయ్యెత్తిన చోట బస్సులు ఆపుతుండటంతో ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. బస్‌ స్టాపుల్లో ఆటోలు తిష్టవేస్తుండటంతో బస్సులు రోడ్ల పైనే ఆగాల్సి వస్తోంది. కాగా, ట్రాఫిక్‌ జరిమానాలను చెల్లించడంలో ఆర్టీసీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రైవేటు వాహనాల మాదిరిగా ట్రాఫిక్‌ పోలీసులు ఆర్టీసీ బస్సులపై కఠిన చర్యలు తీసుకోకపోవటంతో చలాన్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు