Breaking News

చిన్న వయసు.. పెద్ద మనసు

Published on Mon, 02/10/2025 - 10:07

వయసులో ఆమె చాలా చిన్నది.. కానీ గొప్ప మనసుందని ప్రపంచానికి చాటి చెప్పింది.. తాను మరణిస్తున్నానని తెలిసి.. మరో ఐదుగురి ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకుంది. అంతేకాదు..మరణానంతరం మరో ఐదుగురికి ప్రాణంపోయడమే కాదు.. వారి రూపంలో తాను జీవించి ఉందనేలా.. ఆమె తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. అవయవ దానంపై ఆమె నిర్ణయం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు. ఇంతటి గొప్ప త్యాగానికి.. రూపమిచ్చిన ఆమె పేరు డాక్టర్‌ భూమికారెడ్డి.. 

యువ డాక్టర్‌ నంగి భూమికారెడ్డి (24) స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం, తలుపుల మండలం, నంగివాండ్లపల్లి. నంగి నందకుమార్‌ రెడ్డి, లోహిత దంపతుల ఏకైక కుమార్తె. ఇటీవలే వైద్య విద్యను పూర్తి చేసి హైదరాబాద్‌ నగరంలోని ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రిలో హౌస్‌ సర్జన్‌గా వైద్య సేవలను అందిస్తోంది. ఫిబ్రవరి 1న తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు తాను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని అనుకోకుండా ప్రమాదానికి గురైంది. అపస్మారక స్థితిలో ఉన్న భూమికారెడ్డిని సమీపంలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్  ప్రాంతంలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని న్యూరో సర్జన్‌ డాక్టర్‌ శివానందరెడ్డి నేతృత్వంలో వైద్య బృందం చికిత్సలు చేసింది. క్రానియోటమీ సర్జరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం తుది శ్వాస విడిచింది.

బిడ్డ మాట కోసం.. 
భూమికారెడ్డి తమతో పదే పదే అవయవదానం గురించి మాట్లాడుతుండేదని, ఆ మేరకు తమ బిడ్డ మాట కోసం భూమికారెడ్డి అవయవాలను దానం చేయడానికి తమ కుటుంబ సభ్యులతో చర్చించి చివరకు అంగీకరించారు తల్లిదండ్రులు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ గుండెలవిసేలా రోదిస్తుంటే.. ఆస్పత్రిలోని సందర్శకులు, ఇతర రోగుల కళ్లు చెమ్మగిల్లాయి. బిడ్డను కోల్పోయిన బాధను దిగమింగుకుని మరో ఐదుగురి ప్రాణాలను నిలబెట్టాలనే నిర్ణయానికి వచి్చన భూమికారెడ్డి తల్లిదండ్రులను అక్కడి డాక్టర్లు అభినందించారు. అనంతరం భూమికారెడ్డి మృతదేహానికి కాంటినెంటల్‌ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు.

భూమికారెడ్డి త్యాగం వెలకట్టలేనిది.. 
యువ డాక్టర్‌ భూమికారెడ్డి మన మధ్య లేకపోయినా ఆమె చేసిన త్యాగం వెలకట్టలేనిది. ఆమె, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సమిష్టిగా నిర్ణయించి అవయవదానం చేయడానికి ముందుకురావడం కలకాలం గుర్తిండిపోతుంది. భూమికారెడ్డి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం. వైద్య రంగం ఓ మంచి వైద్యురాలిని కోల్పోయింది.  
– కాంటినెంటల్‌ ఆస్పత్రి సీఎండీ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి

అవయవదానం వివరాలు.. 
డాక్టర్‌ భూమికారెడ్డి అవయవాల్లో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, రెండు కిడ్నీలను అవయవదానం చేశారు. ఇందులో భాగంగా ఊపిరితిత్తులను కిమ్స్‌ ఆస్పత్రికి, గుండెను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి, కాలేయం కాంటినెంటల్‌ ఆస్పత్రికి, కిడ్నీల్లో ఒకటి నిమ్స్‌ ఆస్పత్రికి, మరొకటి కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు.  

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)