Breaking News

ఎస్‌హెచ్‌జీలకు రూ.20 వేల కోట్లు

Published on Sun, 06/16/2024 - 04:26

సాక్షి, హైదరాబాద్‌: 2024–25లో రాష్ట్రంలోని 3,56, 273 స్వయం సహాయక మహిళా సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రూ.20,000.39 కోట్లు అందించే లక్ష్యంగా బ్యాంక్‌ లింకేజీ వార్షిక రుణ ప్రణాళికను పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ– గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జీ– బ్యాంక్‌ లింకేజి వార్షిక ఋణ ప్రణాళికలో భాగంగా శనివారం దీనిని విడుదల చేశారు. 

ఎస్‌హెచ్‌జీ వార్షిక ఋణ ప్రణాళికను ఆవిష్కరించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లకు వార్షిక రుణ ప్రణాళికతో పాటు అదనంగా 2,25,000 మహిళలకు వివిధ జీవనోపాధి కార్యక్రమాల నిమిత్తం రూ.4,500 కోట్లు బ్యాంకుల నుంచి సహాయం అందించనున్నట్టు తెలియజేశారు. మహిళాశక్తి క్యాంటీన్లను త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభు త్వం వచ్చాక మహిళల ఆర్థిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో పాటు బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలకు ఏ పూచీకత్తు లేకుండా ఇతోధికంగా ఋణాలు అందిస్తున్నందుకు మహిళల తరపున, ప్రభుత్వం తరపున బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో పీఆర్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, నాబార్డ్‌ సీజీఎం సుశీల చింతల తదితరులుపాల్గొన్నారు.  

#

Tags : 1

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు