Breaking News

అల్పాహారం తిని 20 మందికి అస్వస్థత

Published on Wed, 07/10/2024 - 05:38

రామాయంపేట(మెదక్‌): మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలో ఉన్న మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌లో అల్పాహారం తిన్న 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం అల్పాహారంగా ఉప్మా తిన్నారు. ఇంతలో ఓ విద్యార్థిని బల్లి పడటం చూశానని ఆరోపిస్తుండగా అప్పటికే తిన్న వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హాస్టల్‌ వార్డెన్‌ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

ఇందులో 20 మందికి గ్లూకోజ్‌ ఎక్కించి వైద్యసేవలు అందించగా కోలుకున్నారు. సమాచారం తెలుసుకున్న మెదక్‌ ఆర్డీఓ రమాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, తహసీల్దార్‌ రజనీకుమారి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ పంజా విజయకుమార్‌ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థినులను పరామర్శించారు. అనంతరం ఆర్డీఓ, డీఈఓ, తహసీల్దార్‌ హాస్టల్‌కు వెళ్లి వండిన అన్నాన్ని పరిశీలించారు. 

వంటపాత్రలను, బియ్యాన్ని, ఇతర స్టాక్‌ను కూడా పరిశీలన చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి హాస్టల్‌లోనే భోజనం చేశారు. వంట చేస్తున్న క్రమంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు