Breaking News

లేఅవుట్‌కు రూ.20 లక్షల రైతుబంధు

Published on Wed, 07/10/2024 - 05:50

సాక్షి,మేడ్చల్‌ జిల్లా: మేడ్చల్‌ జిల్లాలో రైతుబంధు పక్కదారి పట్టింది. సాగుకు నోచుకోని లేఅవుట్లు, వెంచర్లు, గుట్టలు, రాళ్లురప్పలు, కంచెలు ఉన్న వేలాది ఎకరాలకు కూడా పెట్టుబడి సాయం అందింది. ఘట్‌కేసర్‌ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని 38, 39, 40 సర్వేనంబర్లలోని 33 ఎకరాల లేఅవుట్‌కు రైతుబంధు అందింది. ఇందులో కొంత వ్యవసాయభూమి కూడా ఉంది. 

రైతు మోత్కుపల్లి యాదగిరిరెడ్డి పేరిట ఐదేళ్లుగా ఈ వెంచర్‌కు రూ. 20 లక్షలు రైతుబంధు పేరిట జమ అయిన విషయం బయటకు పొక్కింది. పోచారానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, రెవెన్యూ అధికారులు విచారించి ఇది వాస్తవమేనని తేల్చారు. మోత్కుపల్లి యాదగిరిరెడ్డి నుంచి రూ.16.80 లక్షలు రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కీసర ఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఘట్‌కేసర్‌ తహసీల్దార్‌ రైతు యాదగిరిరెడ్డి నుంచి రూ.16.80 లక్షల రికవరీ పేరిట నోటీసులు జారీ చేశారు.  

నగర శివారులో ఇలా.. 
నగర శివారులో ఉన్న మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 28,162 ఎక­రా­ల్లో మాత్రమే వివిధ పంటలు సాగవుతున్నాయి. అయితే ఏటా ప్రతి సీజన్‌లో పెట్టుబడి సాయం కింద 66,519 ఎకరాలకు రూ. 39.92 కోట్లు విడుదల అవుతున్నాయి. ఆధార్‌కార్డు అనుసంధానం ఆధారంగా రూ. 33.25 కోట్లు సంబంధిత రైతుల బ్యాంకు ఖా­తాలో ప్ర­భుత్వం జమ చేస్తోంది. అయితే మిగ­తావి సా­గు భూములు కావని, వెంచర్లు, ఫామ్‌ ల్యాండ్స్, బీడు భూములనే ఆరోపణలున్నాయి.  


రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో 4,45,428 ఎకరాలు ఉన్నాయి. పెట్టుబడి సాయం ప్రతీ సీజన్లో రూ.345.36 కోట్ల చొప్పున ఏడాదిలో రెండు పర్యాయాలు ప్రభుత్వం చెల్లిస్తోంది. రంగారెడ్డి జిలాల్లో సీజన్ల వారీగా సాగవుతున్న భూములకు రూ.222.71 కోట్లు సరిపోతుందని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన ప్రభుత్వం అదనంగా రూ.117 కోట్లు మేర లేఅవుట్లు, రాళ్లు, రప్పలు, గుట్టలు, కంచెలు ఉన్న భూములకు చెల్లిస్తుందని వారు ఆరోపిస్తున్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)