Breaking News

2022లో 175 మంది  లాకప్‌ డెత్‌...

Published on Sat, 05/13/2023 - 05:52

సాక్షి, హైదరాబాద్‌: పోలీసుల అదుపులో ఉన్నప్పుడు పలు కారణాలతో జరుగుతున్న మరణాలు.. లాకప్‌డెత్‌లు ఏటికేడాది పెరుగుతున్నాయి. 2022లో ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 175 మంది లాకప్‌డెత్‌ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ మేరకు లాకప్‌డెత్‌లపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) గణాంకాలను కేంద్ర హోంశాఖ.. పార్లమెంట్‌కు సమర్పించింది. హోంశాఖ నివేదిక ప్రకారం.. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 669 మంది లాకప్‌డెత్‌ అయ్యారు.

రాష్ట్రంలో ఇటీవల మెదక్‌ జిల్లాలో జరిగిన ఖదీర్‌ఖాన్‌ లాకప్‌డెత్‌ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గతంలోనూ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మరియమ్మ కస్టోడియల్‌ డెత్‌ సంచనాలకు దారితీసింది. గుజరాత్‌ రాష్ట్రంలో గత అయిదేళ్లలో 80 మంది కస్టోడియల్‌ డెత్‌కు గురయినట్లు ఆ నివేదిక పేర్కొంది. కాగా, దేశంలో అత్యధికంగా లాకప్‌డెత్‌లు గుజరాత్‌లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ లాకప్‌డెత్‌లు ఎక్కువే నమోదవుతున్నాయి.

కస్టడీలో ఉన్న వారి మృతికి పోలీసుల చిత్రహింసలే ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. లాకప్‌డెత్‌ల విషయంలో నామమాత్రంగా చర్యలు మినహా పోలీసులపై కఠిన చర్యలు ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రతిపాదనల మేరకు 201 కేసులలో బాధిత కుటుంబాలకు రూ. 5,80,74,998 పరిహారాన్ని ప్రభుత్వాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)