Breaking News

17ను విమోచన దినంగా నిర్వహించాలి

Published on Fri, 09/13/2024 - 04:40

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్ష సమావేశం డిమాండ్‌ చేసింది. రైతు భరోసా, రుణ మాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 20న బీజేఎల్పీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్‌ తప్పకుండా అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. 

గురువారం అసెంబ్లీ ఆవరణలోని బీజేఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీలు డా.కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, అర్వింద్, డీకే అరుణ, గోడెం నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, డా.పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పాటిల్, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అర్హులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని, అర్హులందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతులకు ఆర్థిక సహాయం అందించాలని, ‘హైడ్రా’నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే డిమాండ్లను ఈ సమావేశం ఫ్రభుత్వం ఎదుట పెట్టింది. దీంతో పాటు పార్టీపరంగా వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, దేవాలయ భూముల రక్షణకు పోరాడాలని, బీజేపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.  

వరద నిధుల వ్యయంపై శ్వేతపత్రం: ఏలేటి డిమాండ్‌ 
వరద నష్టానికి సంబంధించి ఇప్పటివరకు చేసి న పనులు, ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వరద సహాయంపై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేఎల్పీ భేటీ అనంతరం ఎంపీ అ ర్వింద్‌ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వరద సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. 

కాగా, అరికెపూడి గాం«దీకి పీఏసీ చైర్మన్‌ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వలసదారుడు, పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హైడ్రా అధికారులు పాతబస్తీకి వెళ్లడానికి భయపడుతున్నారని, మూసీ నది పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను దమ్ముంటే కూల్చాలని అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)