Breaking News

14,236 అంగన్‌వాడీ కొలువులు

Published on Sun, 02/23/2025 - 05:55

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు సమా­చారం. 

ముఖ్యమంత్రి వద్ద కూడా ఈ ఫైలుకు వేగంగా పరిష్కారం లభిస్తుందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచ­ర్లు, హెల్పర్‌ విభాగంలో మొత్తం 14,236 పోస్టులు ఖాళీగా ఉండగా వాటిలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 6,399, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులు 7,837 ఖాళీగా ఉన్నట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లెక్కగట్టింది. 

‘కోడ్‌’ ముగిశాక నియామక ప్రక్రియ... 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే అంగన్‌వాడీల్లో ఖాళీలుంటే నిర్దేశించుకున్న లక్ష్యాల అమలు కష్టసాధ్యం అవుతుందన్న ఉద్దేశంతో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖకు సూచించింది. దీంతో పదవీవిరమణకు అర్హత సాధించిన వారు, పదోన్నతికి అర్హత ఉన్న వారితోపాటు కేటగిరీలవారీగా ఖాళీలను లెక్కించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. 

ప్రస్తుతం ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమాళి వచ్చే నెల తొలివారం వరకు కొనసాగనుంది. దీంతో కోడ్‌ ముగిశాక నియామక నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలవారీగా ఖాళీలను ఖరారు చేశాక వాటిని ఆయా జిల్లా కలెక్టర్లకు పంపేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టనుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడతాయి. గతంలో ఈ పోస్టులను భర్తీ చేసినప్పటికీ వేల సంఖ్యలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్‌ పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి.   

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)