Breaking News

బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్‌ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు

Published on Sun, 08/13/2023 - 05:57

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మధ్య పెండింగ్‌ బిల్లుల జగడం మళ్లీ రాజుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్‌ చేసి గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం పంపించగా.. వారం రోజుల నుంచి రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన టీఎస్‌ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023 కూడా వీటిలో ఉంది. గవర్నర్‌ ఆమోదించాక, ప్రభుత్వం గజిట్‌ నోటిఫికేషన్లను జారీ చేశాక ఈ బిల్లులు చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి. 

రెండోసారి పంపినా నిరీక్షణ 
గవర్నర్‌ తమిళిసై గతంలో తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన మరో బిల్లుతో కలిపి మొత్తం 4 బిల్లులను ప్రభుత్వం ఇటీవల రెండోసారి అసెంబ్లీలో ఆమోదించింది. వీటితోపాటు మరో 8 కొత్త బిల్లులను సైతం ఆమోదించి.. మొత్తం 12 బిల్లులను రాజ్‌భవన్‌కు పంపింది. వీటి విషయంలో గవర్నర్‌ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్‌ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపిస్తే.. గవర్నర్‌ ఆమోదించక తప్పదని రాజ్యాంగంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి.

ఈ మేరకు సదరు నాలుగు బిల్లులను ఆమోదించడం తప్ప గవర్నర్‌కు గత్యంతరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరికొన్ని రోజులు గవర్నర్‌ స్పందన కోసం నిరీక్షించిన అనంతరం.. పెండింగ్‌ బిల్లుల వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రెండు నెలల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉండటంతో.. ఆలోగానే బిల్లులను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. 

ఎమ్మెల్సీ అభ్యర్థులపై ‘పరిశీలన’! 
గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎరుకల సామాజికవర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బలహీనవర్గాల నుంచి దాసోజు శ్రవణ్‌లను నామినేట్‌ చేయాలని రాష్ట్ర కేబినెట్‌ గత నెల 31న తీర్మానం చేసి పంపినా.. గవర్నర్‌ తమిళిసై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీలుగా నియమించేందుకు వారికి ఉన్న అర్హతలను గవర్నర్‌ పరిశీలిస్తున్నారని రాజ్‌భవన్‌ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు గతంలో కొంతకాలం బీజేపీలో పనిచేసి.. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరినవారే. గతంలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసేందుకు గవర్నర్‌ సమ్మతించకపోవడం నేపథ్యంలో.. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. 

నెలల తరబడి పరిశీలనలోనే..!  
పెండింగ్‌ బిల్లులపై గవర్నర్‌ తమిళిసై న్యాయ సలహా కోరినట్టు సమాచారం. బిల్లులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా? లేదా? అన్న అంశంపై పరిశీలన కోసం తనకు అవసరమైనంత సమయం తీసుకుంటానని గవర్నర్‌ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నెలల తరబడి బిల్లులు రాజ్‌భవన్‌ ‘పరిశీలన’లో ఉండిపోతున్నాయి. 

రాజ్‌భవన్‌లో ఉన్న బిల్లులు ఇవీ.. 
రెండోసారి ఆమోదించి పంపినవి.. 

  •  తెలంగాణ మున్సిపల్‌ బిల్లు–2022 
  • తెలంగాణ ప్రైవేటు వర్సిటీల బిల్లు–2022 
  • రాష్ట్ర పంచాయతీరాజ్‌ బిల్లు–2023 
  •  తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఏజ్‌ ఆఫ్‌ సూపర్‌ యాన్యూయేషన్‌) బిల్లు–2022 

తొలిసారిగా ఆమోదించి పంపినవి.. 

  •  తెలంగాణ పంచాయతీరాజ్‌ (మూడో సవరణ) బిల్లు – 2023 
  •  తెలంగాణ మున్సిపాలిటీల (రెండో సవరణ) బిల్లు–2023 
  •  తెలంగాణ ఆర్టీసీ బిల్లు (సర్కారులో ఉద్యోగుల విలీనం) – 2023 
  •  తెలంగాణ పంచాయతీరాజ్‌ (రెండో సవరణ) బిల్లు–2023 
  • తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ బిల్లు–2023 
  •   తెలంగాణ స్టేట్‌ మైనారిటీస్‌ కమిషన్‌ బిల్లు–2023 
  •  ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు–2023 
  • టిమ్స్‌ వైద్య సంస్థల బిల్లు–2023    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)