Breaking News

నిర్మల్‌లో 11వ శతాబ్దపు శిలాశాసనం

Published on Mon, 11/24/2025 - 02:57

కడెం: నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్‌ గ్రామం సమీపంలో గోదావరి, కడెం నది సంగమ ప్రాంతం ప్రవాహ మధ్య తీరంలో ఒక అరుదైన శిలాశాసనాన్ని చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్‌ గుర్తించారు. తెలుగు, కన్నడ లిపిలో ఉన్న ఈ శాసనాన్ని పరిశీలించిన ఆయన, 11వ శతాబ్దపు కాకతీయ పరిపాలన కాలంనాటిది అయి ఉంటుందని తెలిపారు. 

శాసనంలోని కొన్ని పదాలు కడెం–గోదావరి సంగమానికి సంబంధించినవిగా వివరించారు. అయితే ఇది పూర్తి శాసనం కాదని, ఇతర ప్రదేశంలో వేరే పరుపు బండలపై మిగతా శాసన భాగాలు ఉండి ఉండవచ్చని తెలిపారు. నీటి ప్రవాహం పూర్తిగా తగ్గితే వాటిని గుర్తించవచ్చని వెల్లడించారు.  

పురాతన విగ్రహాలు కూడా..  
శాసనం లభ్యమైన నదీ జలాల్లో రాష్ట్రకూటశైలి కాలానికి (క్రీ.శ.సుమారు పదో శతాబ్దం) చెందిన మహిషాసుర మర్ధిని విగ్రహం, కాకతీయ కాలానికి చెందిన (క్రీ.శ.11లో శతాబ్దపు)గణపతి విగ్రహం, మలికాకతీయ కాలానికి(13వ శతాబ్దం)చెందిన మహిళా దేవత విగ్రహం విరిగిన భాగాలు లభ్యమయ్యాయి. ఈ ప్రాంతపు తీరభాగంలో రాష్ట్ర కూటుల కాలానికే చెందిన దేవాలయ స్తంభాలు కనిపించాయి. దీంతో ఈప్రాంతం రాష్ట్ర కూటుల పాలనలో, కాకతీయుల పాలనలోనూ భాగమై ఉండేదని తెలుస్తోంది. 

గోదావరికి ఆవతల ఉన్న కొండ క్వారీ నుంచి ఆ కాలంలో భారీ ఎత్తున దేవాలయానికి అవసరమైన విడిభాగాలను తీరంపై ప్రాంతానికి తరలించినట్లు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో యువ పరిశోధకుడు రాజశేఖర్‌ పాలుపంచుకున్నారు. 

అరుదైన జలాధి శాసనమిది 
ఇంతవరకు నదుల సంగమం వద్ద ఇలాంటి శాసనాలు ఎక్కడా లభించలేదు. అరుదైన జలాధి శాసనమిది. ముందు తరాలు గతాన్ని తెలుసుకునేందుకు అప్పటి చరిత్రే మూలం. పురాతన ఆలయాలు, విగ్రహాల పరిరక్షణ మనందరి బాధ్యత. ప్రభుత్వం వీటిని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.   – కరిపె రాజ్‌కుమార్, చరిత్ర పరిశోధకుడు 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)