Breaking News

గురుకుల పాఠశాలలో బాలిక బలన్మరణం, ట్రాక్టర్‌లో మృతదేహం తరలింపు వివాదం

Published on Mon, 10/27/2025 - 10:51

తెలంగాణా హనుమకొండ జిల్లా,  భీమదేవరపల్లి మండలంలోని వంగర (పీవీ రంగారావు) బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి పాఠశాలకు వెళ్లిన బిడ్డ  అనూహ్యంగా కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  స్కూలు  ప్రిన్సిపాల్ , వైస్ ప్రిన్సిపాల్ తనను వేధిస్తున్నారని తల్లిదండ్రులతో ఫోన్‌ ద్వారా మొరపెట్టుకుంది. తనను ఇంటికి తీసుకెళ్లాలని కన్నీటితో వేడుకున్న కొంతసేపటికే ఆమె వసతి గృహంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బాధిత బాలికను హుజురాబాద్ మండలం, రంగాపూర్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థిని వనం శ్రీవర్ష (14)నిగా గుర్తించారు.

అక్టోబర్ 23న దీపావళి సెలవుల తర్వాత శ్రీవర్ష పాఠశాలకు తిరిగి వచ్చింది. అయితే ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగా  తమ కుమార్తె శ్రీవర్ష ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో వస్తువులు దొంగతనంచేసిందని ఆమెపై తప్పుడు ఆరోపణలతో  వేధించారని కుటుంబం , మరికొంతమంది కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చదువుల్లో రాణిస్తూ, అత్యుత్తమ విద్యార్థినిగా ఇటీవల జిల్లా కలెక్టర్ నుండి అవార్డు కూడా అందుకుందని ఆమె సహచరులు, ఇతర మిత్రులు గుర్తు చేసుకున్నారు. తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ఆమెకు ఆరోగ్య సమస్యలున్నాయి పాఠశాల అధికారులు సిబ్బంది  ఈ ఆరోపణలను ఖండించారు.

మరోవైపు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌కు బదులుగా ట్రాక్టర్‌లో తరలిలంచడం  తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. రెండేళ్లలో గురుకులాలలో  110 విద్యార్థులు చనిపోయారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి  నిదర్శనమని మండిపడ్డారు.  
 

 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు