Breaking News

టెన్త్‌ ఫీజు రాయితీకి ని‘బంధనాలు’!

Published on Sat, 11/23/2024 - 08:35

సాక్షి, సిటీబ్యూరో: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పదో తరగతి పరీక్ష ఫీజు రాయితీ అందడం లేదు. ఇందుకు ఏళ్ల కిందట రూపొందించిన నిబంధనలే కారణమని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయంపై తగిన మార్పుల కోసం రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించడం లేదని వారంటున్నారు. రాయితీ నిబంధనలను ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా సవరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, నగర విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.  

రాయితీ పొందాలంటే.. 
ప్రస్తుతం 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ ఇటీవల విడుదలైంది. ఈ నెల 28వ తేదీతో గడువు ముగియనుంది. విద్యార్థులంతా ఫీజులు చెల్లించే పనుల్లో నిమగ్నమయ్యారు.  

నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి పరీక్ష రుసుం కింద రూ.125 చెల్లించాలి. వంద శాతం రాయితీ పొందాలంటే  విద్యార్థులు వార్షిక ఆదాయ ధ్రువపత్రాన్ని సమరి్పంచాలి. హైదరాబాద్‌ నగరంతో సహా శివారు జిల్లాల్లోని విద్యాసంస్థల్లో ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 1.18 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో సుమారు 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటారని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. 

వీరి కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపు ఉంటేనే వంద శాతం ఫీజు రాయితీ వర్తిస్తుంది. కానీ ప్రస్తుతం అంత తక్కువ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ నిబంధన చాలా ఏళ్ల కిందట రూపొందించారు. ఇప్పుడు సగటున వార్షిక ఆదాయం రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉండాలని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏ విద్యారి్థకీ రాయితీ లభించడం లేదు. ఆదాయ పరిమితిని సవరిస్తేనే ఫలితం ఉంటుందని టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్‌ ఇలా 
అపరాధ రుసుం లేకుండా గడువు: ఈ నెల 28 వరకు 
రూ.50 అపరాధ రుసుం: డిసెంబరు 2 
రూ.200 అపరాధ రుసుం: డిసెంబరు 12 
రూ.500 అపరాధ రుసుంతో: డిసెంబరు 21 వరకు..  


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)