Breaking News

IRS అధికారి ఇంట చోరీ కేసులో కొత్త కోణం.. ఎస్‌ఐ కృష్ణ స్కెచే ఇది..

Published on Fri, 06/30/2023 - 12:39

సాక్షి, హైదరాబాద్‌: రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దొంగతం కేసులో ఎస్‌ఐ కృష్ణనే సూత్రదారిగా పోలీసు అధికారులు గుర్తించారు. సురేందర్ అనే వ్యక్తితో కలిసి రూ.100 కోట్ల ఆస్తి కొట్టేసేందుకు కృష్ణ స్కెచ్ వేసినట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఎస్సై కృష్ణను అదపులోకి తీసుకుని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇక, ఈ కేసులో సురేందర్‌ను విచారించడంతో వెలుగులోకి ఎస్‌ఐ కృష్ణ వ్యవహారం బయటకు వచ్చింది. సురేందర్ అనే వ్యక్తితో కలిసి 100 కోట్ల ఆస్థి కొట్టేసేందుకు కృష్ణ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 30న శామ్యూల్‌కు సురేందర్ మత్తు మందు ఇచ్చాడు.. శామ్యూల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లను సురేందర్ చోరీ చేశాడు. 40 ల్యాండ్ డాక్యుమెంట్లు, 5 లక్షల నగదుతో పాటు 30 తులాలు బంగారాన్ని సురేందర్ దోపిడీ చేశాడు. 

ఇక, ఈ డాక్యుమెంట్లను కృష్ణకు అందించాడు సురేందర్‌. కాగా, సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను పోలీసులు సేకరించారు. మరోవైపు.. సురేందర్‌ చోరీ చేసన సొమ్ముతో గోవా వెళ్లి క్యాసినో ఆడినట్టు తెలిపాడు. గతంలో సైతం క్యాసినోకు బానిసై సురేందర్ అప్పుల పాలైనట్లు చెప్పాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎస్‌ఐ కృష్ణను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశాడు. ఎస్‌ఐ కృష్ణా, సురేందర్‌ల అక్రమ దందాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌, బీజేపీకి షాక్‌!.. పొంగులేటి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)