Breaking News

ఆర్టీసీకి లక్కీ మండే.. ఒక్కరోజే రూ.20.36 కోట్ల ఆదాయం 

Published on Wed, 06/07/2023 - 08:14

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీకి సోమవారం రద్దీ బాగా కలిసొస్తోంది. గత నెల 15న సోమవారం రోజు రికార్డు స్థాయిలో రూ.20.26 కోట్ల ఆదాయాన్ని సాధించిన ఆర్టీసీ , తాజాగా ఈ సోమవారం దాన్ని బ్రేక్‌ చేస్తూ రూ.20.36 కోట్లను పొందింది. గత సంక్రాంతి తర్వాతి రోజు, రాఖీ పౌర్ణమి రోజు రూ.20 కోట్లను మించి టికెట్‌ రూపంలో ఆదాయం పొందింది. మిగతా సందర్భాల్లో ఒకేరోజు రూ.20 కోట్లను మించి ఆదాయం రికార్డు కాలేదు. ఆ రెండు సందర్భాలు పండుగలతో ముడిపడి ఉన్నందున, ఆర్టీసీ కొంత ఆశించి లక్ష్యంగా పెట్టుకుని ఆదాయం పొందింది.

ఈ సోమవారం ఎలాంటి పండుగలు లేకున్నా అంత ఆదాయం రావటం విశేషం. నిర్ధారించుకున్న లక్ష్యాన్ని మించి 116 శాతం ఆదాయం పొందటం గమనార్హం. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో అది 122 శాతంగా నమోదైంది. ఆక్యుపెన్సీ రేషియో 82 శాతంగా నమోదైంది. సోమవారంరోజు 34.26 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్టు రికార్డు అయింది. కిలోమీటర్‌కు రూ.53.74 చొప్పున ఆదాయం (ఈపీకే) వచి్చనట్టు అధికారులు పేర్కొంటున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)