Breaking News

ఖమ్మంలో అంధుల కోసం ప్రత్యేక పార్కు.. విశేషాలివే!

Published on Fri, 06/16/2023 - 04:06

పార్కు అంటే అందరికీ ఆహ్లాదం కలిగించేదే.  కానీ లోకాన్ని చూడలేని అంధులు పార్కుకు  వెళితే.. ఎలా నడవాలి, ఎటు వెళ్లాలి? ఊయలలోనో, మరో ఆట పరికరంపైనో పడిపోకుండా ఎలా ఆహ్లాదం పొందాలి? ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలోనే.. ఖమ్మంలోని వినూత్నమైన పార్కును సిద్ధం చేశారు.

అంధులైన చిన్నారులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేశారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించిన లూయీస్‌ బ్రెయిలీ విగ్రహాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రారంభించనున్న ఈ పార్కు విశేషాలివీ..  – ఖమ్మం మయూరి సెంటర్‌

సులువుగా నడిచేలా.. 
చేతికర్ర సాయంతో నడిచే అంధులు పార్కులో ఇబ్బంది పడకుండా వాకింగ్‌ ట్రాక్‌పై ప్రత్యేక టైల్స్‌ ఏర్పాటు చేయించారు. దారిలో ముందుకు వెళ్లాలని సూచించేలా పొడవుగా ఉండే బుడిపెలతో కూడిన టైల్స్‌ను ట్రాక్‌ మధ్యలో పెట్టారు. మలుపు తీసుకోవాల్సిన చోట, మధ్యలో పక్క నుంచి మరోదారి ఉన్న చోట.. ఈ విషయాన్ని గుర్తించగలిగేలా చిన్న బుడిపెలతో కూడిన ‘అలర్ట్‌ టైల్స్‌’ను ఏర్పాటు చేశారు. చేతికర్ర, లేదా పాదాలతో తాక­డం ద్వారా అంధులు వీటిని గుర్తిస్తూ.. సు­లువుగా నడిచి వెళ్లేందుకు వీలుంటుంది. 

పడిపోకుండా.. పట్టుకోల్పోకుండా.. 
అంధులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు కూడా ప్రయోజన కరంగా ఉండేలా ఆట వస్తువులను ఈ పార్కు­లో ఏర్పాటు చేశారు. సీ–సా (రెండు వైపు­లా ఇద్దరు కూర్చుని పైకి కింది ఊగే పరికరం), ఊయల, జారుడు బల్ల వంటి వాటికి.. రెండు పక్కలా, వెనకాల కుర్చిల తరహా­లో పట్టుకునేలా తయారు చేయించారు. 

♦ పార్కులో ఏర్పాటు చేసిన పంచతత్వ విభాగం (ఇసుక, సన్నని రాళ్లు, గడ్డి, సాధారణ మట్టి, నీళ్లు.. ఇలా ఐదు రకాలతో కూడిన వాకింగ్‌ ట్రాక్‌)లో కూడా రెండు వైపులా ఇనుప కడ్డీలను అమర్చారు. అంధులతోపాటు వయో వృద్ధులు వాటిని పట్టుకుని సులువుగా నడవడానికి వీలవుతుంది. 

ప్రత్యేక సంగీత పరికరాలు కూడా.. 
దివ్యాంగులు, అంధులు మరింత ఏకాగ్రత సాధించేందుకు మ్యూజిక్‌ థెరపీ ఉపయోగపడుతుందని చెప్తుంటారు. ఈ క్రమంలో పార్కులో వారికోసం ప్రత్యేకంగా సంగీత పరికరాలను ఏర్పాటు చేశా­రు. కాండెజా, కాంగస్‌ డ్రమ్స్, సోప్రానో పెంటాటోనిక్, బెబల్‌ డ్రమ్‌ వంటి వాయిద్య పరికరాలను అమర్చారు. ఇక పార్క్‌ ఆవరణలో స్థానిక కార్పొరేటర్‌ మక్బూల్‌ సొంత నిధులతో చిన్న గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయించారు. 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)