Breaking News

ఇప్పటికే ఏడుగురు.. ఇప్పుడు మరో ముగ్గురు.. మొత్తం 10 మంది పిల్లలు

Published on Thu, 07/06/2023 - 04:22

భద్రాచలం అర్బన్‌: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ఆదివాసీ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల­కు జన్మనిచ్చింది. ఇది సాధారణ కాన్పు కావడం విశేషం. కాగా ఆమెకు ఇప్పటికే ఏడు­గురు పిల్లలు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజా­పూర్‌ జిల్లా బట్టిగూడెంకు చెందిన పుజ్జ అనే మహిళకు ఈనెల 2వ తేదీన పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.

బుధవారం పుజ్జ మొదట ఇద్దరు మగ శిశువులకు జన్మనివ్వగా వైద్యులు కవల పిల్లలనే అనుకున్నారు. ఇంతలోనే పుజ్జ మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు, తల్లి క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, పుజ్జ వయసు 29 ఏళ్లు మాత్రమే కాగా, ఆమెకు ఇది ఎనిమిదో కాన్పు అని చెప్పారు.

ఇప్పటికే ఆమెకు నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు అబ్బాయిలు ఉండగా, ఇప్పుడు పుట్టిన ముగ్గురితో కలిపి ఆమెకు మొత్తం పది మంది సంతానం అయ్యారు. పుజ్జకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేశాక డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పుజ్జకు సాధారణ ప్రసవం జరిగేలా కృషి చేసిన హెడ్‌నర్సు విజయశ్రీ, ఇతర సిబ్బందిని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రామకృష్ణ అభినందించారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)