Breaking News

ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి.. సీఎం నాటిన మొక్కకు హ్యాపీ బర్త్‌డే

Published on Fri, 07/07/2023 - 08:09

సాక్షి, మహేశ్వరం: విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు పయనంలో మన్సాన్‌పల్లి చౌరస్తా వద్ద తన కాన్వా య్‌ను ఆపారు. నాగారం వైపు వెళ్తున్న బస్సు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ముచ్చటించారు.

ఏ పాఠశాలలో చదు తున్నారు? బస్సులు సమయానికి వస్తున్నాయా? ప్రభుత్వ పాఠశాలలో బోధన, వసతులు బాగున్నాయా?.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో ఆమె ఫొటోలు దిగారు. కాసేపు బస్సులో ప్రయాణించిన తర్వాత మంత్రి .. తిరిగి తన కారులో హైదరాబాద్‌ బయలుదేరారు. 

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి...తన ఇంటి వద్ద ఎనిమిదేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ మొదటి విడత హరితహారంలో నాటిన మొక్కకు గురువారం పుట్టినరోజు వేడుక నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్‌ చొరవ వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయన్నారు.
-వేల్పూర్‌ 

అరక పట్టిన అమాత్యుడు
నిర్మల్‌ జిల్లాలో గిరిజనులకు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సారంగాపూర్‌ మండలం రవీంద్రనగర్‌ తండాకు వెళ్లి పోడు భూమిలో ఇలా అరక పట్టి దుక్కి దున్నారు. పోడు భూముల్లో రతనాలు పండించి ఆదర్శంగా నిలవాలని ఆదివాసీ రైతులకు సూచించారు. 
– సాక్షి ఫొటోగ్రాఫర్‌ నిర్మల్‌

అల‘గెల’గా
సాధారణంగా ఒక అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే కాస్తుంది. ఇందుకు భిన్నంగా ఒకే చెట్టుకు రెండు అరటి గెలలు కాశాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ మద్దిపుట్టులో ఓ గిరిజనుడి ఇంటి వద్ద ఈ అద్భుతాన్ని పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.  
– హుకుంపేట

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)