TS: గుడ్‌న్యూస్‌.. నేటి నుంచే రైతుబంధు జమ

Published on Mon, 06/26/2023 - 11:02

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రైతుబంధు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వానాకాలం(ఖరీఫ్‌ సీజన్‌) పంటకుగానూ..  1.54కోట్ల ఎకరాలకుగానూ సుమారు 70 లక్షల మందికి సాయంగా దాదాపు రూ.7,720 కోట్లకుపైనే కేసీఆర్‌ సర్కార్‌ ఈ దఫా ఆదివారమే విడుదల చేసింది. రైతులకు పంట సాయం రూపంలో.. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రారంభించిందే ఈ రైతుబంధు. 

రైతన్నకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున సర్కారు అందిస్తుండగా.. కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే పది విడుతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. పదకొండో విడత కోసం నిన్ననే నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయగా..  భాగంగా నేడు(జూన్‌ 26, సోమవారం) నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

రైతు బంధు పంపిణీలో భాగంగా తొలిరోజైన ఇవాళ.. గుంట భూమి నుంచి ఎకరం విస్తీర్ణం గల భూయజమానులు 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్ల నగదు జమ కానుంది.

ఇక.. ఇక ఈ ఏడాది కొత్తగా 5 లక్షల మంది రైతులకు పథకాన్ని వర్తింప చేస్తున్నారు.  అలాగే.. 1.5లక్షల మంది పోడు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ ఈ నిధుల్ని నేటి నుంచే అకౌంట్లలో వేయనుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వేసే నగదుతో.. ఈసారి సర్కార్‌ ఖజానా నుంచి సుమారు రూ.300 కోట్ల అదనం కానుంది. 11వ విడతతో కలిపి ఇప్పటివరకూ రైతులకు రైతుబంధు ద్వారా మొత్తం రూ.72,910 కోట్ల సాయం అందించారు.

ఇదీ చదవండి: దళిత బంధు.. క్లారిటీ లేని తీరు!

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)