Breaking News

రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా

Published on Fri, 06/23/2023 - 01:34

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 36 మంది రా రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల మేరకు జరిమానా విధించామని అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం రైస్‌మిల్లర్లతో సమీక్షించిన అనంతరం 2020–2021 వానాకాలానికి సంబంధించి డిఫాల్ట్‌ అయిన రా రైస్‌మిల్లర్లకు జరిమానా విధించినట్లు వివరించారు.

12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి సకాలంలో ఇవ్వలేదని, గడువులోగా ఇవ్వని 36 మంది రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ.. తక్షణమే రూ.2 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. 2022–2023 వానాకాలానికి సంబంధించి కస్టమ్‌ మిల్లింగ్‌ డెలివరీపై ఖీమ్యానాయక్‌ ఆరా తీశారు. 1,46,341 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 6,931 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేశారని పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు.

సాధ్యమైనంత తొందరగా సీఎమ్మార్‌ను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. డీఎస్‌వో ఎస్‌.జితేందర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ జీఎం జితేంద్రప్రసాద్, రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు, రైస్‌మిల్లర్లు గరిపెల్లి ప్రభాకర్, చేపూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)