Breaking News

ఆరోగ్యమే మహా భాగ్యం!

Published on Mon, 07/03/2023 - 02:31

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యమే మహాభాగ్యం... ఈ నినాదాన్ని భారతీయులు తరతరాలుగా ఒక సందేశంగా తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ భారతీయులకు దీని అవసరం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే 2022–23 ఆర్థిక సంవత్సరంలో తమ కుటుంబ ఆదాయాల్లో పది శాతానికిపైగా ఆరోగ్య పరిరక్షణకు భారతీయులు వ్యయం చేస్తున్నట్టుగా ఇటీవల నివేదికలో వెల్లడైంది. దీనికి సంబంధించి అత్యధికంగా ఖర్చు చేస్తున్న టాప్‌–5 రాష్ట్రాల్లో కేరళ, మహా­రాష్ట్ర, యూపీ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌ నిలుస్తున్నాయి.

ఇది 2017–18 స్థాయిలను బట్టి చూస్తే గణనీయంగా వైద్య, ఆరోగ్యంపై ఖర్చు పెరగడానికి ప్రధానంగా కోవిడ్‌ మహ­మ్మా­రి కారణంగా తలెత్తిన విపత్కర, అనిశి్చత పరిస్థితులే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌) పురోగతిపై తాజాగా ‘మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌’విడుదల చేసిన డేటాలో ఆయా అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

దేశవ్యాప్తంగా మొత్తంగా చూస్తే.. 2022–23లో 6.67 శాతం ప్ర­జలు తమ ఆదాయాల్లో పదిశాతానికిపైగా (2017–18లో ఇది 4.48 శాతం) వ్యయం చేశారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా... మొత్తం కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేస్తున్న వారు 2.3 శాతం మంది ఉన్నట్టుగా ఈ డేటా స్పష్టం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలి్చతే పట్టణ ప్రాంతాల్లోని వారే తమ ఆదాయంలో పదిశాతానికి పైగా వ్యయం చేస్తున్నట్టుగా వెల్లడైంది.

ఐతే కొన్ని సందర్భాల్లో...పరిస్థితులు చేయి దాటడం లేదా విపత్కర పరిస్థితులు ఎదురుకావడం వంటివి చోటుచేసుకున్నపుడు మాత్రం గ్రామాల్లోని ప్రజలు తమ కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేయాల్సి వస్తోన్నట్టు తెలుస్తోంది.  

ఇదిలా ఉంటే... 
భారతీయుల వైద్య, ఆరోగ్యానికి సంబంధించి తలసరి వ్యయం 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి (కరోనా తరువాత) అత్యధికంగా పెరిగినట్టుగా కేంద్ర మంత్రిత్వశాఖ నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ (ఎన్‌హెచ్‌ఏ) అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆరోగ్యం, కుటుంబాల ‘ఔట్‌ ఆఫ్‌ ప్యాకెట్‌’వైద్య, ఆరోగ్య వ్యయంపై ప్రభుత్వం ఖర్చు పెంచాక ఈ వృద్ధి నమోదైనట్టుగా ఈ అంచనాల్లోపేర్కొన్నారు. 2014–15 లలో ప్రభుత్వం చేస్తున్న తలసరిఖర్చు రూ. 1,100 కాగా, 2019–20 కల్లా అది రూ. 2,014కు పెరిగినట్టు ఇందులో తెలిపారు.  

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)