Breaking News

ఆధునిక హంగులతో.. పర్యాటక కేంద్రాల అభివృద్ధి

Published on Sun, 07/02/2023 - 04:17

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌తో పాటు వివిధ పట్టణాలలో ఆధునిక మ్యూజికల్‌ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలి­స్తున్నామని మంత్రులు తెలిపారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా యోసూ పట్టణంలోని బిగ్‌ ఓ మ్యూజికల్‌ ఫౌంటెన్‌ షోను శనివారం మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌­కుమార్‌ తదితరులు తిలకించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఫౌంటెన్‌ కంటే ఆధునికమైన ఫౌంటెయిన్‌ను కరీంనగర్‌లోని మానేరు రివర్‌ ఫ్రంట్‌లో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. దక్షిణ కొరియాలోని పర్యాటక ప్రదేశాలను పరిశీలించి ఆధునిక హంగులతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో రాష్ట్రంలో వివిధ పట్టణాల్లోని పర్యాటక కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్ప­నకు పెద్దపీట వేస్తామన్నారు.

రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా ఆధునిక పరిజ్ఞానంతో పనిచేసే మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌లు, జెయింట్‌ వీల్స్, వాటర్‌ స్పోర్ట్స్‌ వంటి వాటిని కరీంనగర్‌లోని మానేరు రివర్‌ ఫ్రంట్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, మహబూబ్‌నగర్‌లోని ట్యాంక్‌ బండ్‌ వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)