Breaking News

న్యాయం చేయకుంటే నక్సలైట్‌గా మారుతా! 

Published on Sun, 06/25/2023 - 01:47

ఇల్లెందు: ప్రజాప్రతిఘటన పార్టీలో దళ కమాండర్‌గా పనిచేసిన తన తండ్రి బొల్లి రామయ్య అలియాస్‌ దేవన్న లొంగిపోతే పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు కాజేశారని, రెవెన్యూ అధికారులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నా రని దేవన్న కుమారుడు సాత్విక్‌ ఆరోపించాడు. తమ కుటుంబానికి న్యాయం చేయకుంటే నక్సలైట్‌గా మారుతానని చెప్పాడు.

శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సాత్విక్‌ విలేకరులతో మాట్లాడాడు. తన తండ్రికి ఇల్లెందు – ఖమ్మం రహదారిలోని సుభాష్‌నగర్‌ వద్ద 603 సర్వే నంబర్‌లో ప్రభుత్వం మూడు గుంటల భూమి ఇచ్చిందని చెప్పాడు. అయితే పట్టణానికి చెందిన రాము అనే వ్యక్తి తమ భూమితో పాటు పక్కనున్న 16 గుంటల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశాడని ఆరోపించాడు.

తన తండ్రి దేవన్న మృతిచెందడంతో దొంగ పత్రాలు సృష్టించారని, రెవెన్యూ అధికారులు సైతం ఆయనకే వత్తాసు పలుకుతున్నారని చెప్పాడు. తన తండ్రి ఆయుధం వదిలినందుకు సర్కారు ఇచ్చిన స్థలాన్ని తిరిగి ఆయుధం పట్టుకుని కాపాడుకుంటానని సాత్విక్‌ తెలిపాడు. దీనిపై ఇల్లెందు తహసీల్దార్‌ కృష్ణవేణిని వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో విచారణ చేస్తామని తెలిపారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)